సరదాగా మొదలై వ్యసనంగా మారుతున్న ఐపీఎల్ బెట్టింగ్

 సరదాగా మొదలై వ్యసనంగా మారుతున్న ఐపీఎల్ బెట్టింగ్



అశ్వారావుపేట, మార్చి 25(మనఊరు న్యూస్): సరదాగా మొదలయ్యి వ్యసనం గా మారుతున్నా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ యువత లో వేగం గా విస్తరిస్తున్న ఐపీయల్ బెట్టింగ్, ఈజీ మనీ కి అలవాటుపడి ప్రాణాలు కోల్పోతున్న యువత,బెట్టింగ్ ల మీద నిఘా పెడుతున్న కొత్త మార్గల్లో పయనిస్తు, విస్తరిస్తున్న క్రికెట్ బెట్టింగ్ మాఫియా,కొత్త కొత్త యాప్ లు కనిపెడుతూ వ్యవహారం మొత్తం ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ ద్వారా బెట్టింగ్ బాబులు బెట్టింగులు నడుపుతూ యువత ను ఐపీఎల్ బెట్టింగ్ లోకి దించుతున్నారు. ఐపీయల్ బెట్టింగ్లు ఆడి అప్పులోళ్ళకి సమాధానం చెప్పలేక కుటుంబాని కి మరియు బంధువులకి మొహం చూపించలేక చావు చుసిన వాళ్లు అనేక మంది. జూదం ఆడుతుంటే మత్తుకన్నా స్పీడ్ గా ఎక్కుతుంది నరాలకి, వేగంగా వచ్చే రుపాయి వేగంగా నడిపే బండి ఎప్పోడో ఓ అప్పుడు కింద పడేస్తాయి.ఒకడిని ఒకడు దోచుకోవడం మోసం అదే వందల మందిని ఒక్కడే దోచుకోవడం బెట్టింగ్. ఐపీయల్ సీజన్ వచ్చింది అంటే చాలు బెట్టింగ్ రాయుడులు రెచ్చిపోతున్నారు,అమాయకులు మరియు బెట్టింగ్ మోజు ఉన్న వారే వారి టార్గెట్ గా మారారు. మొదట్లో బానే ఉన్న క్రమం గా అప్పులో కురుకుపోయి ప్రాణాలమీదకి తెచ్చుకుంటున్నవారు వేలల్లో ఉన్నారు.ఈ విషయం పై డిపార్ట్మెంట్ వారిని వివరణ కోరగా బెట్టింగ్ ని ఉపేక్షించేది లేదని ఎవరిని వదలమని కఠినంగా చర్యలు తీసుకుంటా అని తెలిపారు.తల్లి తండ్రులు కూడా తమ పిల్లల పై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని అనుమాన స్పదం గా వారి లవా దేవిలపై ఓ కన్నేసి ఉంచాలని ఉన్న సున్నితంగా మందలించాలని నిపుణులు మరియు డిపార్ట్మెంట్ వారు హెచ్చరిస్తున్నారు.అదే విదంగా ఎవరైనా ఐపీఎల్ ని ఆడుతున్న ప్రొచాహిస్తున్న వెంటనే తమకు తెలపాలని డిపార్ట్మెంట్ వారి సూచన.