*ఆంజనేయస్వామి దేవాలయంలో శాస్త్రోక్తంగా విశ్వ వాసు సంవత్సర పంచాంగ శ్రవణం*

 *ఆంజనేయస్వామి దేవాలయంలో శాస్త్రోక్తంగా విశ్వ వాసు సంవత్సర పంచాంగ శ్రవణం*


బలుమూరు, మార్చి 30 (మనఊరు న్యూస్): నూతన తెలుగు సంవత్సరం విశ్వ వాసు పర్వదినం సందర్భంగా ఉగాది పర్వదినం సందర్భంగా మండల కేంద్రంలోని శ్రీఆంజనేయస్వామి దేవాలయంలో ఆలయ అర్చకులు నరేష్ ఆచార్య అయ్యంగారీచే పంచాంగ శ్రవణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సంవత్సరం సూర్యుడు రాజు అని, చంద్రుడు మంత్రిగా వ్యవహరిస్తున్నాడని పాడిపంటలు ఆరోగ్యం విశేషంగా ఉంటుందన్నారు. అన్ని రాశుల వారికి ఆదాయం వ్యయం వివరాలు భక్తులకు వివరించారు. రెండుసార్లు గ్రహణకాలం ఉందన్నారు. సకాలంలో వర్షాలు పంటలు లభిస్తాయన్నారు. రాశులలో గురువు శని భగవాన్ కృపా కటాక్షాలు పొందుటకు భక్తుల అధిక సంఖ్యలో సేవించాలన్నారు. పంచాంగ శ్రవణం వినడం వల్ల అనేక లాభాలు ఉంటాయని నిత్యం పంచాంగం చూసుకుంటూ ముందుకు వెళ్లాలన్ననీ సూచించారు. ఏప్రిల్ 9 నుండి జూన్ 10 వరకు వివాహ కార్యక్రమాలు జరుపుకోవచ్చని, తదుపరి మోడ్యాలు ఉన్నాయని తిరిగి శ్రావణమాసంలో చేసుకోవచ్చన్నారు. గ్రహబలం తక్కువగా ఉన్నవారు పరమశివునికి రుద్రాభిషేకాలు, గురువుకు అభిషేకాలు, దర్శనాలు భగవత్ కార్యాలు ఎక్కువ చేయాలని సూచించారు.