*వి.జానకి రాములు గౌడ్ కి శ్రీ చిగుళ్ళపల్లి రంగయ్య స్మారక పురస్కారం ప్రదానం*

 *వి.జానకి రాములు గౌడ్ కి శ్రీ చిగుళ్ళపల్లి రంగయ్య స్మారక పురస్కారం ప్రదానం*



జాతీయ సాహిత్య పరిషత్ జడ్చర్ల శాఖ ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనం కార్యక్రమంలో జాతీయ సాహిత్య పరిషత్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి, సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, జడ్చర్ల జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు పద్మలీల,కిరణ్మయి, సాహిత్య పరిషత్ సభ్యులు  ఉమ్మెత్తల మహేశ్వర్, వెంకటరమణాచార్యులు, బుచ్చిలింగం, యాదగిరి, డాక్టర్ రామ్ రెడ్డి, కాల్వ రాంరెడ్డి,సాకేత్ ప్రవీణ్, భాస్కర్, రాధాకృష్ణ, జాతీయ సాహిత్య పరిషత్ సభ్యులు సన్మాన గ్రహీతలు పాల్గొన్నారు, ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సంకల్పం, సేవా తత్వంతో ప్రజలకు అంకితమైన జీవితాన్ని గడిపిన వి.జానకి రాములు గౌడ్ కవిగా, రచయితగా

విశిష్ట సేవల పట్ల గౌరవంగా, శ్రీ చిగుళ్ళపల్లి రంగయ్య స్మారక పురస్కారం ప్రదానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రముఖులు, సాంస్కృతిక ప్రముఖులు మరియు పలువురు సాహితీ ప్రేమికులు పాల్గొన్నారు. పురస్కార ప్రదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ సందర్భంగా  జానకి రాములు గౌడ్  మాట్లాడుతూ, "సేవా మార్గంలో నడిచే ప్రతి ఒక్కరికీ ఇది ప్రోత్సాహకరమైన సంఘటన. ప్రజలకు ఉపయోగపడే విధంగా మరింత సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని అన్నారు.

ఈ పురస్కారం, ప్రజల సేవలో విశేష కృషి చేసిన వారికి గౌరవార్థం ప్రదానం చేయబడుతుంది. శ్రీ చిగుళ్ళపల్లి రంగయ్య  సేవా స్ఫూర్తిని కొనసాగించడమే ఈ పురస్కారం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.కార్యక్రమం నిర్వహణలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికీ జానకి రాములు గౌడ్  కృతజ్ఞతలు తెలియజేశారు.