*బూర్గుల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో టైల్స్ ధ్వంసం..*
*టైల్స్ ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు..*
*దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలంటున్న గ్రామస్థుల ఆవేదన*
వందలాది మంది విద్యార్థులనుఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన పాఠశాలలో గుర్తుతెలియని దుండగులు పాఠశాలలోకి అక్రమంగా ప్రవేశించి టైల్స్ ను ధ్వంసం చేసిన ఘటన వెలుగు లోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం పరిధిలో బూర్గుల గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ లో మరుగుదొడ్ల కోసం ఏర్పాటు చేసిన టైల్స్ ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.. సుమారుగా 30 బాక్స్ ల టైల్స్ ని ధ్వంసం చేశారని గ్రామస్థులు తెలిపారు.. పాఠశాలను ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేసి పాఠశాలలను నిర్మిస్తే వాటిని సంరక్షించుకోవలసిన బాధ్యత అందరిదని ఇలాంటి పనులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
