*తెలంగాణ లెజెండ్ ప్రజా సమస్యలను ఎత్తిచూపాలి..!*
*స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ కుమార్ రెడ్డి*
*తెలంగాణ లెజెండ్ కార్యాలయ ప్రారంభోత్సవంలో యాజమాన్యానికి ఆల్ ది బెస్ట్ చెప్పిన ఎమ్మెల్సీ*
షాద్ నగర్, మార్చి 30 (మనఊరు న్యూస్): ఎన్నో ఆశలతో ఆశయాలతో నేడు నూతనంగా ప్రారంభించబడిన తెలంగాణ లెజెండ్ దినపత్రిక అండ్ ఛానల్ యాజమాన్యం ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపాలని, పాలకొల్లు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి తమ వంతు పాత్ర పోషించాల్సి ఉంటుందని మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ కుమార్ రెడ్డి సూచించారు. ఆదివారం ఈ మేరకు తెలంగాణ లెజెండ్ దినపత్రిక అండ్ ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విశ్వావసు నామ కొత్త సంవత్సరంలో ఉగాది పర్వదినాన ప్రారంభోత్సవం చేసుకోవడం శుభ పరిణామం అన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి తాను హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. కష్టపడుతూ సమస్యలను ప్రచురిస్తూ ముందుకెళ్తే మీడియా రంగం ప్రజల విశ్వాసాన్ని చురగొంటుందని అభిప్రాయపడ్డారు. అనంతరం ఈ పేపర్ లోగోను ఎమ్మెల్సీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డి సి ఎం ఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మీడియా రంగంలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న తెలంగాణ లెజెండ్ యాజమాన్యం మల్దే శ్రీశైలం, నవీన్ కుమార్ లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. నిజాయితీగా మీడియా ప్రతినిధులు పనిచేస్తే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

