ఊరుకొండ పేట ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు
ఉరుకొండ, మార్చి 26 (మనఊరు న్యూస్): ఊరుకొండ పేట పబ్బతి అంజనేయ స్వామి ఆలయంలో బుధవారం హుండీ లెక్కించారు. ఆంజనేయ స్వామి వారి ఆలయానికి భారీగా ఆదాయం లభించింది. ఆలయ హుండీ లెక్కింపును దేవాలయ చైర్మన్, ధర్మకర్త మండలి సభ్యులు, ఆలయ కార్యనిర్వాహణాధికారి, దేవాదాయశాఖ అధికారులు, ఆలయ అర్చకులు, భక్తులు గ్రామస్తుల సమక్షంలో నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ నారెడ్డి సత్యనారాయణ రెడ్డి తెలియజేశారు. 2025 జనవరి 20 నుండి 26 మార్చ్ 2025 వరకు గత 2 నెలల 5 రోజులు పైగా భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ 5,10,977 పైగా నగదు వచ్చినట్లు ఆలయ చైర్మన్ నారెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి సత్య చంద్రారెడ్డి తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు దొందయ్య గౌడ్, వెంకటమ్మ, ఆంజనేయులు, మల్లేష్, రమేష్, విజయేందర్, బంగారయ్య, పత్యానాయక్, భక్తులు మనోహర్ రెడ్డి, శ్రీశైలం, ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, ప్రవీణ్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.



