విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
మాస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పత్తిపాటి లష్మికాంతమ్మ
ఖమ్మం, మార్చి 25 (మనఊరు న్యూస్): విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మాస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పత్తిపాటి లష్మికాంతమ్మ అన్నారు. మంగళవారం చింతకాని మండలం, అనంతసాగర్ ప్రాధమిక పాఠ శాలలో విద్యార్థులకు మాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యపై అవగాహన కల్పించారు. 70 మందికి రాగి జవతా త్రాగడానికి గ్లాసులు త్వరలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ప్రయోగాత్మకమైన విద్యను నేర్చుకున్నప్పుడే వారికి బంగారు భవిష్యత్తు ఉంటుంన్నారు. మూస పద్ధతిలో చదువును బట్టి విధానానికి స్వస్తి పలకాలన్నారు. ప్రయోగాత్మకమైన విద్యతో పోటీ పరీక్షల్లో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. గ్రామీణ విద్యార్థులకు ఆహ్లాదకరమైన ప్రాంతంలో నాణ్యమైన విద్యను అందిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పిల్లల భోజనం పరిశీలించారు. హెచ్ఎం భిక్షం, ఉపాధ్యాయులు పూర్ణచందర్, సోనిమియా, అంగన్ వాడి టీచర్ ఉమ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.



