అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులను, ఈవోని వెంటనే సస్పెండ్ చేయాలి ....
భద్రాచలం, మార్చి 26 (మనఊరు న్యూస్): ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కి అక్రమ సంపాదనే లక్ష్యంగా భద్రాచలం నడి బొడ్డున బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు ఇచ్చి ఏజెన్సీ చట్టాలను నిర్వీర్యం చేస్తూన్న ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల బుధవారం బహుళ అంతస్తుల భవనం కుప్పకూలి ఆరుగురు మృతి చెందడం జరిగిందని, ఇతరులకు గాయాలయ్యాయని, దీనికి పూర్తి బాధ్యత అక్రమ నిర్మాణానికి అనుమతి ఇచ్చిన అధికారులు, భద్రాచలం ఈఓ నే పూర్తి బాధ్యత వహించాలని మహాజన మహిళ సమైఖ్య జిల్లా అధ్యక్షులు మేకల లత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంత చట్టాలను ఏమాత్రం పట్టించుకోకుండా అధికార యంత్రంగం తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ లకు అక్రమ అనుమతులు ఇస్తూ ఏజెన్సీ చట్టాన్ని ఆపసహ్యం చేస్తున్నారని, అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన ప్రాణాలు కోల్పోటానికి కారణమైన ప్రభుత్వ అధికారులను, భద్రాచలం ఈవోని వెంటనే సస్పెండ్ చేసి నిర్లక్ష్యం కారణంగా చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలని, గాయాల పాయలైన వారికి పూర్తి వైద్యం ఉచితంగా అందించి నష్టపరిహారం రూ 50 లక్షలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి బహులంతస్తుల బిల్డింగులకు అనుమతి నిరాకరించాలని, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాల యాజమాన్యంపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

