మూడు దశాబ్దాల ఆత్మీయ స్నేహ సమ్మిళితం

 *మూడు దశాబ్దాల ఆత్మీయ స్నేహ సమ్మిళితం*

"*స్నేహం అద్భుత మైన ఒక వరం*





జడ్చర్ల రూరల్, మార్చి 28 (మనఊరు న్యూస్): ప్రతి ఏడాది ఏప్రిల్ ఒకటి తారీకు వచ్చిందంటే... వాళ్లు ఎక్కడ ఉన్నా ..ఎంత దూరాన ఉన్నా.. ఒకే వేదిక దగ్గరకు చేరుకొని ఆ ఏడాది చేయాలనుకున్న కార్యక్రమాలతో పాటు ఆత్మీయత అనుబంధాలను నెమరు వేసుకొని ముందుకు సాగడం మూడు దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తుంది.


 -స్నేహ మాధుర్యాన్ని అనుభూతి పొందడం కొందరికే సాధ్యం, అలాంటి నిజమైన స్నేహితులే, డా.బిఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1995 బిఎ సంవత్సరం విద్యార్థులు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న ఆత్మీయ మిత్రుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకొని స్నేహానికీ ఒక సరికొత్త నిర్వచనాన్ని ఇస్తూ కొత్త వొరవాడిని సృష్టించింది.

*స్నేహానికీ సరికొత్త రూపాన్నీస్తూ*

*నేడు 30వ ఆత్మీయ సమ్మేళనాన్ని* వారిలో ఒకరైన *మిత్రుడు నరేందర్ డీఎస్పీ వురైనా,బాలానగర్ మండలం లోని ఖానాపూర్ లో జరుపుకుంటున్నారు. వీరి బ్యాచ్, వివిధ రంగాల్లో, రాజకీయాల్లో ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, రాణిస్తూ, కొందరు ఇతర వృత్తుల్లో అందరూ ఆదర్శనీయంగా ఎదిగారు. కేవలం కలవడమే కాకుండా, వివిధ సామాజిక సేవల్లో, పాలు పంచుకొంటున్నారు, చదివిన డిగ్రీ కళాశాల అభివృద్ధికీ, రూ 25000 ఆర్థిక సహాయం 50, కుర్చీలు, వితరణ, తోటి మిత్రులు, ఆర్థిక, ఆరోగ్య సమస్యలలో వున్నప్పుడు, ఆర్థికంగా, ఆదు కుంటూ, చేయూత నిస్తూ, స్నేహితుల గొప్పతనాన్ని, సమాజానికీ తెలియకుండా, స్నేహబి రుచి వున్నవారికీ మార్గదర్శనం చేస్తూ, స్నేహానికీ సరికొత్త రూపం మిస్తున్న.

  *ఈ డిగ్రీ మిత్రులు అభినందనీయులు* వీరిలో నరేందర్ డిఎస్పీగా, రవీందర్ రెడ్డి, జగన్ లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, తిరుపత య్య, రమేష్, కాశిరావ్, రామనాథ్, అనంత రాములు, యుగందర్, యాదయ్య, శారద శ్రీలత , ప్రశాంతి ఉపాధ్యాయురాలుగా, వెంకటరమణ, సుధాకర్ రెడ్డి, హన్మంతులు రాజకీయ నాయకులుగా, శశిదర్ రెడ్డి, జిల్లా స్థాయి రిపోర్టర్ గా, సురేందర్, కండక్టర్ గా, మురళి, బాలు, దేవేందర్, సువర్ణ, వకులదేవి, మొదలగువారు ఇతర రంగాల్లో, రాణిస్తూ వారికీ వారే సాటి అని నిరూపిస్తూ, స్నేహని కన్నా, మిన్న లోకాన లేదురా అంటూ నిరూపిస్తూ ఆదర్శమిస్తున్న డిగ్రీ 1995 బ్యాచ్, మిత్రబృందానికీ అభినందనలు తెలిపారు.