*రామాలయంలో శాస్త్రోక్తంగా విశ్వ వాసు సంవత్సర పంచాంగ శ్రవణం*
నాగర్ కర్నూల్, మార్చి 30 (మనఊరు న్యూస్): నూతన తెలుగు సంవత్సరం విశ్వ వాసు పర్వదినం సందర్భంగా ఉగాది రోజు జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగారీచే పంచాంగ శ్రవణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సంవత్సరం సూర్యుడు రాజు అని చంద్రుడు మంత్రిగా వ్యవహరిస్తున్నాడని పాడిపంటలు ఆరోగ్యం విశేషంగా ఉంటుందన్నారు. అన్ని రాశుల వారికి ఆదాయం వ్యయం వివరాలు భక్తులకు తెలిపారు. రెండుసార్లు గ్రహణకాలం ఉందన్నారు. సకాలంలో వర్షాలు పంటలు లభిస్తాయన్నారు.రాశులలో గురువు శని భగవాన్ కృపా కటాక్షాలు పొందుటకు భక్తుల అధిక సంఖ్యలో సేవించాలన్నారు. పంచాంగ శ్రవణం వినడం వల్ల అనేక లాభాలు ఉంటాయని నిత్యం పంచాంగం చూసుకుంటూ ముందుకు వెళ్లాలన్ననీ సూచించారు. ఏప్రిల్ 9 నుండి జూన్ 10 వరకు వివాహ కార్యక్రమాలు జరుపుకోవచ్చని, తదుపరి మోడ్యాలు ఉన్నాయని తిరిగి శ్రావణమాసంలో చేసుకోవచ్చన్నారు. గ్రహబలం తక్కువగా ఉన్నవారు పరమశివునికి రుద్రాభిషేకాలు గురువుకు అభిషేకాలు దర్శనాలు భగవత్ కార్యాలు ఎక్కువ చేయాలని సూచించారు.శనీశ్వర స్వామివారిని శక్తి కొలది పూజించాలన్నారు. పంచాంగ శ్రవణం అనంతరం భక్తులందరికీ ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. తదుపరి నిత్య విష్ణు సహస్ర పారాయణ కమిటీ వారిచే విష్ణు సహస్ర పారాయణం సామూహికంగా భక్తులచే నిర్వహించారు. గోచార రీత్యా గ్రహాలు బాగలేని వారు బ్రాహ్మణులకు వివిధ ధాన్యాలు దానంగా ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అర్థం రవీందర్, పుల్లయ్య, రాములు, శారద, రఘునందన్ గౌడ్, సూర్య కుమార, జటమోనినర్సయ్య, కాంతయ్య, శ్రీనివాసులు, బాలయ్య, రమాదేవి, శ్యాం, సోమ ప్రగతి, మాన్యపురెడ్డి, బాలిశ్వరయ్య, ఆలయ పూజారులు కందాడై శ్రీనివాసచార్యులు, వెంకటరమన్, వేణుగోపాల్, గోమటం శ్రీనివాసచార్యులు, కాందా డై జయలక్ష్మి, సుధారాణి, వివిధ ప్రాంతాల నుండి భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


