పాలెం వెంకన్న హుండీ లెక్కింపు

 పాలెం వెంకన్న హుండీ లెక్కింపు

 నగదు రూ3లక్షల17వేల 864, బంగారం 35గ్రాములు...





బీజినపల్లి, మార్చి 25 (మనఊరు న్యూస్): మండల పరిధిలోని పాలెం గ్రామంలో వెలిసిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపు నాగర్ కర్నూల్ దేవదాయ శాఖ జిల్లా పర్యవేక్షకులు వేంకటేశ్వరి, ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు మనుసాని విష్ణుమూర్తి ఆధ్వర్యంలో భక్తులచే నిర్వహించారు. జనవరి 23 నుండి నేటి వరకు వెంకన్న ఆలయం, శివాలయం పరిధిలోని హుండీలు లెక్కించగా వచ్చిన ఆదాయము రూ 3,17,864ల నగదు, బంగారం 35 గ్రాములు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామి వారికి మూడుపూలు, కానుకలు సమర్పించి నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సి. హెచ్.రంగరావు తెలియజేశారు. అనంతరంహుండీ లెక్కించిన భక్తులకు,పూజలలో పాల్గొన్న భక్తులకు స్వామి అమ్మవార్ల,స్వామి వారికి ప్రత్యేకంగా నివేదించిన తీర్థ ప్రసాదాల వితరణ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానఅర్చకులు కురవి రామానుజాచార్యులు, జయంత్, శుక్లా, చక్రపాణి, మాజీ ధర్మకర్తలు, గ్రామ ప్రజలు, మాజీ ప్రజా ప్రతినిధులు జగన్ మోహన్, విశ్రాంత ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ రెడ్డి, ఆలయ సిబ్బంది ఆర్.శివకుమార్, బాబయ్య, శ్రీవారి సేవకులు జగదీష్, భక్తులు, సేవకులు సంఖ్యలో పాల్గొన్నారు.