ఇస్రోను సందర్శించిన మరికల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు

 ఇస్రోను సందర్శించిన మరికల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు




ఇస్రోను సందర్శించిన మరికల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు



మరికల్, మార్చి 24 (మనఊరు న్యూస్): ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలోని ఇస్రోను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరికల్ కు చెందిన జీవ శాస్త్రం ఉపాధ్యాయుడు మల్లప్ప ఆధ్వర్యంలో విద్యార్థులు శారద, శైలజ, వర్షిని, నందిని, విష్ణు సందర్శించి అక్కడ ఉన్న రాకెట్స్ ను ప్రయోగించే విధానం వాటి యెుక్క ప్రాముఖ్యతను రెండు రోజులు అక్కడే ఉండి శాస్త్రవేత్తలను గైడ్ లను సంప్రదించి వాటి పని తీరును ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. 

ఇస్రోను సందర్శించినందుకు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాల విద్యార్థులను మల్లప్ప, శ్రీహరికోటకు తీసుకువెల్లినoదుకు హెచ్ఎం సర్వమంగళ, సరస్వతి, విజయలక్ష్మి, శైలజ, రామకృష్ణ, వెంకటయ్య, పాండురంగయ్యచారి, రాజు, మల్లయ్య, శివప్రసాద్, హన్మయ్య, శశిధర్ తదితరులు అభినందించారు.