*లక్ష్మీపల్లి లో వైభవంగా ఉగాది వేడుకలు*

 *లక్ష్మీపల్లి లో వైభవంగా ఉగాది వేడుకలు*


దేవరకద్ర, మార్చి 29 (మనఊరు న్యూస్):  దేవరకద్ర మండలంలోని లక్ష్మీ పల్లిలో శనివారం తెలుగు సంవత్సర విశ్వావసు నామ ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. ప్రాథమిక పాఠశాల, జడ్పీ ఉన్నత పాఠశాలల ఆవరణలో ఏర్పాటు చేసిన చదుల తల్లి సరస్వతి దేవి చిత్ర పటానికి ఆయా పాఠశాలల హెచ్ యం లు ఎస్.కల్పన, కె కె శ్రీనివాస్ లు జ్యోతి ప్రజ్వలన చేసి , పూలమాలలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉగాది వేడుకలను ప్రారంభించారు. విద్యార్థిని, విద్యార్థులు సంప్రదాయ దుస్తులను ధరించి ఉగాది వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని అలరింప జేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త లయన్ అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉగాది పండుగ ప్రాముఖ్యత గురించి, తెలుగు సంవత్సరం, నెలల గురించి అవగాహన కల్పించారు. ఉగాది అంటే షడ్రుచుల సమ్మేళనమని, కష్ట సుఖాలను సమాన రీతిలో చూడాలన్నారు. కష్టం వచ్చినప్పుడు కుంగిపోవద్దని, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవద్దని అన్నారు. జీవితం అంటే తీపి, చెదుల కలయిక అన్నారు. అన్నింటిని తట్టుకొని జీవిత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఉగాది పచ్చడిని తయారు చేసి సేవించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత, ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలు కె కె శ్రీనివాస్, ఎస్.కల్పన, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ వాకిటి అరుణ, ఉపాధ్యాయులు కోటకద్ర మురళీధర్, ఆస్ర ఖాద్రి, డి.శంకర్, కమల్ రాజ్, మదన్ మోహన్, సుజాత, అశ్విని చంద్రశేఖర్, నాగేశ్వర్ రెడ్డి, విద్యా వాలింటర్ వెంకట్రాములు, మహిళా మండలి సభ్యురాలు భాగ్య లక్ష్మీ, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.