అంజనీకుమారికి ఉగాది పురస్కారం

 అంజనీకుమారికి ఉగాది పురస్కారం



హైదరాబాద్, మార్చి 30 (మనఊరు న్యూస్): ఢీ భారతి మణి ఫౌండేషన్, ఆనంద లహరి కల్చరల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో రంగ రంగా వైభవంగా ఉగాది వేడుకలు.... అలైడ్ ఆటోరియం (AAA) హిమాయత్ నగర్, వాసవి శ్రీముఖి కాంప్లెక్స్ నందు జరిగినవి, ఈ వేడుకలలో పాల్గొన్న అంజనీకుమారికి ఉగాది పురస్కారం తో ఘనముగా సన్మానించడం జరిగినది, ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరికీ ముందుగా పురస్కారాలు అందుకుంటున్న అందరికీ శుభాభినందనలు అలాగే విశ్వా వసు నామ సంవత్సర సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశం ఒక సాంస్కృతిక సాంప్రదాయాలు గల ఒక వస్తదైన కుటుంబము ఆ కుటుంబం నుండి వచ్చిన వేడుకలు ఉగాది సంక్రాంతి దసరా మొదలగు పండగలు ఈ సందర్భంగా మనము మన కుటుంబ సాంప్రదాయాన్ని పాటిస్తూ సమాజం పట్ల మన బాధ్యతలు బాంధవ్యాలతో ముడిపడి ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది ఒక భారతదేశమే మరి ఇలాంటి భరత భూమి జన్మించిన ప్రతి ఒక్కరు ధన్యులే, అలాగే ఈ సంస్థ యొక్క ఫౌండర్ చైర్పర్సన్ ఆనందలక్ష్మి మరియు వ్యవస్థాపకులు హేమ ఆంజనేయులు అలాగే ఆర్గనైజర్ దేవేంద్ర గౌడ్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు శుభాకాంక్షలు. ఈ అవార్డు నాకు సమాజం పట్ల కర్తవ్యాన్ని, గౌరవాన్ని ఇంకా మెరుగుపరుచుకునే విధముగా ఉన్నది, మాలాంటి సంఘ సేవకులకు వృత్తి రీత్యా చేయు ఉద్యోగమునందు క్రమశిక్షణ సమాజం పట్ల మా బాధ్యత గుర్తు చేస్తుంది, నిజంగా ఈ అవార్డ్స్ మాలాంటి వారికి గొప్ప అనుభూతి ఎందుకంటే ఇంకా ఉత్సాహంతో మా ముందున్న బాధ్యతలను సంతోషంగా నిర్వర్తిస్తానికి ఇదొక మంచి శుభ పరిమాణము గా భావించవచ్చు, అలాగే శ్రీమతి ఆనంద లక్ష్మీ గారు దేవేంద్రగౌడ్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అనేకమందికి గాయనే గాయకులకు కళాకారులకు ఈ వేదిక ద్వారా పరిచయం చేస్తూ వారికి లైఫ్ లైన్ ఇస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజానికి ఆదర్శము గా ఉన్నారు, ఈరోజు ఉగాది వేడుకలలో నాకు అవకాశం కల్పించి ఉగాది పురస్కారంతో నన్ను సన్మానించినందుకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసినారు. అలాగే ఈ ఫౌండేషన్ ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక వస్తదైన కుటుంబంగా ఈ ఫౌండేషన్ సమాజంలో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు నాతో పాటు ఉగాది పురస్కారాన్ని అందుకున్న పరమేశ్వరి కి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో కళారత్న వంశీ రామరాజు, వెంకట్రావు, వినోద్ గౌడ్, సావిత్రిబాయి పూలే ఫౌండర్ మీనా గోపి, రంగస్థల నటుడు దామోదర్ నాగేంద్ర, చిత్ర పరిశ్రమకు చెందిన విజయ్ చిత్ర న్యూస్ ఎడిటర్ విజయ్ కుమార్, శ్రీనివాస కళావేదిక శ్రీనివాసరావు, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ అశోక్, అనేకమంది ప్రముఖులు గాయని గాయకులు నాగమణి, స్వీటీ, రాణి, అపర్ణ, స్వప్న , ప్రియా, సరస్వతి, శ్రావణి, రవి, కిషోర్, మద్దయ్య, కె. యు, రాజు, శిల్పవెంకటలక్ష్మి, సూర్య, భరతనాట్యతో అంజనాదేవి, గానంతో తేజస్విని. కళాకారులు గాయనీ గాయకులు పాల్గొన్నారు.