ఘనంగా బండ్ల ఊరేగింపు..
అమ్మవారి ప్రత్యేక అభిషేకాలు..
పెద్ద శంకరంపేట్, మార్చి 30 (మనఊరు న్యూస్): ఉగాది పర్వదినం పురస్కరించుకొని పెద్ద శంకరంపేటలోని దుర్గమ్మ దేవాలయం చుట్టూ ఆదివారం సాయంత్రం ఘనంగా బండ్ల ఊరేగింపు నిర్వహించారు.. పేటలోని పలు పురవీధుల గుండా భాజా భజంత్రీలతో యువకులు నృత్యాలు చేస్తూ ఎద్దుల పండ్లు ఊరేగింపుగా దుర్గమ్మ దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేయించారు.. ఈ సంవత్సరం నూతనంగా ఏర్పాటు చేసిన పొట్టేలు పలహారం బండ్లను ప్రత్యేకంగా అలంకరించడంతోపాటు పలువురుని ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఉదయం నుండి దుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడంతోపాటు అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. మహిళలు ఓడి బియ్యం సమర్పించి తమ మొక్కలను చెల్లించుకున్నారు. దుర్గమ్మ దేవాలయం అనంతరం బండ్ల ఊరేగింపు కొండల రాయిని గుడి.. పోచమ్మ దేవాలయం చుట్టూ బండ్లను ఊరేగించారు.. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు యువకులు, చిన్న పెద్ద అంతా ఉల్లాసంగా ఉత్సాహంగా జాతర కార్యక్రమంలో పాల్గొన్నారు.
