తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు
హనుమకొండలో చికిత్స పొందుతున్న పెంటయ్య
నెల్లికుదూరు, మార్చి 28 (మనఊరు న్యూస్): తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని నైనాల గ్రామానికి చెందిన నానం పెంటయ్య (55) తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మధ్యాహ్నం వేళ తాటి చెట్టు ఎక్కి కల్లు తీస్తుండగా, ప్రమాదవశాత్తూ కాలు జారి కిందపడడంతో ఆయనకు తీవ్రమైన గాయాలు అయ్యాయి.ఈ ఘటనలో పెంటయ్యకు పక్కటేముకలు విరిగిపోయాయి, అంతేకాకుండా వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అంబులెన్స్ ద్వారా మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అక్కడ సరైన సదుపాయాలు లేకపోవడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు సూచించడంతో హనుమకొండలోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఐసియులో చికిత్స పొందుతున్న పెంటయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆయన త్వరగ కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
