సన్నబియ్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

 సన్నబియ్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 





రాజాపూర్, ఏప్రిల్ 1 (మనఊరు ప్రతినిధి): ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిందని ఈ సన్నబియ్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని రాయపల్లిలో రేషన్ షాపులో సన్న బియ్యం పంపిన కార్యక్రమాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన ప్రజలందరికీ సన్న బియ్యం పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ప్రజా పంపిణీ ద్వారా ఇకపై ప్రతి నెల దొడ్డు బియ్యంకు బదులుగా సన్నబియ్యం అందజేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని తెలిపారు. సన్న బియ్యంతో పాటు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, లబ్దిదారులు పాల్గొన్నారు.