పెరిగిన ఎండలు.. స్విమ్మింగ్ పూల్స్‌కు ఫుల్ డిమాండ్..
మహబూబ్ నగర్, ఏప్రిల్ 24 (మనఊరు ప్రతినిధి): సమ్మర్ వచ్చిందంటే చాలు స్విమ్మింగ్ పూల్ అన్ని సందడిగా కనిపిస్తూ ఉంటాయి. మహబూబ్ నగర్ లో స్విమ్మింగ్ ఫూల్స్లో చిన్న, పెద్ద అనే వయసు తేడా లేకుండా ఈత నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీనితో స్విమ్మింగ్ పూల్స్ అన్నీ ఈతగాళ్లతో కలకలాడుతున్నాయి. ఈత నేర్పించాలని ఉద్దేశంతో తల్లిదండ్రులు పిల్లలను స్విమ్మింగ్ పూల్‌కు తీసుకొస్తారు. సిమ్మింగ్ నేర్చుకోవాలనుకునే వారికి ఎండాకాలం ఓ చక్కని అవకాశం. ముఖ్యంగా వేసవి సెలవుల్లో స్విమ్మింగ్‌పై విద్యార్థులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈత నేర్పించాలని ఉద్దేశంతో తల్లిదండ్రులు పిల్లలను స్విమ్మింగ్ పూల్‌కు తీసుకొస్తారు. సిమ్మింగ్ నేర్చుకోవాలనుకునే వారికి ఎండాకాలం ఓ చక్కని అవకాశం. స్విమ్మింగ్ పూల్ అన్ని ఉదయం, సాయంత్రం వేళలో ఫుల్ రద్దీగా కనిపిస్తున్నాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా స్విమ్మింగ్ పూల్స్‌లో ఈత నేర్చుకుంటున్నారు. సిమ్మింగ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు. ఈత కొట్టడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం, దొరుకుతుంది. బాడీ ఫిట్‌గా, మంచి ఆకృతిలో ఉంటుందని చెబుతున్నారు. దినచర్యలో భాగంగా డైలీ ఒకసారి స్విమ్మింగ్ చేయాలంటున్నారు, ఈతగాళ్లు. స్విమ్మింగ్ చేయడం వల్ల కొన్ని జబ్బులకు, మెంటల్ టెన్షన్లకు దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు నిర్వాహకులు. స్విమ్మింగ్ పూల్స్‌లో ఈత నేర్చుకోవడం ఎంతో హ్యాపీగా ఉందంటున్నారు చిన్నారులు. అలాగే జిల్లా కేంద్రంలోని బాలానగర్ మండల కేంద్రానికి చెందిన నరేష్ గౌడ్ కుమారునికి పాఠశాలకు వేసవి సెలవులు ఇచ్చినందుకు పిల్లలను జిల్లా కేంద్రంలోని ఓ స్విమ్మింగ్ పూల్ కి వెళ్లి వారి కుమారునికి ఈత నేర్పించాలని ఉద్దేశంతో అక్కడికి తీసుకుని వెళ్ళి ఈత నేర్పి వస్తున్నట్లు తెలిపారు.


