డిగ్రీ కళాశాలల ప్రాక్టికల్ పరీక్షల బహిష్కరణ

 డిగ్రీ కళాశాలల ప్రాక్టికల్ పరీక్షల బహిష్కరణ

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 2 (మనఊరు ప్రతినిధి): రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ 

శ్రీ సాయి కృప డిగ్రీ అండ్ పీజీ కళాశాల భువనగిరి కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ తోపాటు ప్రిన్సిపల్, అధ్యాపకులు ప్రాక్టికల్ పరీక్షలను బహిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి నల్గొండ జిల్లా ఫైనాన్స్ సెక్రటరీ దరిపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలు నుంచి రీయంబర్స్మెంట్ లేక, విద్యార్థులకు స్కాలర్ షిప్ లు రాక యాజమాన్యాలు, విద్యార్థులకు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది కలుగుతుందని యాజమాన్యాలు అప్పుల ఊబిలో కోరుకుపోయి వడ్డీలు కట్టలేనీ పరిస్థితులలో ఉన్నారని, ఇది ఇలాగే కొనసాగితే యాజమాన్యాలు ఎంతో మనోవేదన అనుభవించాల్సి ఉంటుందని కళాశాలలు నడపలేరని, తద్వారా మన రాష్ట్రానికి ఎంతో నాణ్యమైన విద్యని అందించే ప్రైవేటు యాజమాన్యాలు కళాశాలలు నడపలేకపోతే రాష్ట్రనికి నైపుణ్యం గల విద్యార్థులు లేక మొదటి స్థానంలో ఉన్న మన తెలంగాణ రాష్ట్రం చివరి స్థానానికి పోతుందని, మన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఇప్పుడు నడుపుతున్న ఈ ప్రభుత్వానికి ఎంతో నష్టమని వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేసి విద్యార్థులను, యాజమాన్యాలను ఆదుకోవాలని కోరారు.