*రైతు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా*
*మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ
కేశంపేట, ఏప్రిల్ 22 (మనఊరు ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో గల వివిధ గ్రామాల నుండి ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణమ్మని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. షాద్ నగర్ నుంచి యాదగిరిగుట్టకు జరిగిన పాదయాత్రలో భాగంగా పాల్గొన్న వారందరినీ ప్రేమతో పలకరించిన డీకే అరుణమ్మ. మండలంలోని చాలా సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లిన భారతీయ జనతా పార్టీ మండల నాయకులు కార్యకర్తలు. ప్రతీ సమస్యను సానుకూలంగా విని మీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చిన అరుణమ్మ గారు. విజయ పాల డైరీ రేట్లు రోజు రోజుకు తగ్గిస్తున్నారని ఎండా కాలంలో రేట్లు తగ్గడమేంటని ఎండలకు ఒకవైపు పశువులకు మేతలేక రైతులు ఇబ్బంది పడుతుంటే పాల రేట్లు తగ్గించి రైతులను నిట్ట నిలువునా మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఆక్షేపించిన రైతు సోదరులు. రైతు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్న ఎంపీ. అదేవిధంగా మండలం లో ఎక్కువగా పాడై పోయిన రోడ్ లలో కొనయపల్లి నుండి కొత్తపేట రోడ్ గురించి గ్రామాల్లో హై మాస్ట్ లైట్స్ గురించి మండలం లో ఇంకా అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్ ల గురించి, స్థానికంగా ఉన్న కర్మాగారాల్లో ఫ్యాక్టరీల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తలేరని యువకులు అడగడం జరిగింది. ప్రతీ విషయం విని సానుకూలంగా స్పందించిన పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణమ్మ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల అధ్యక్షురాలు రొల్లు రాధిక, మాజీ మండల అధ్యక్షుడు రొల్లు రఘురాం గౌడ్, జిల్లా కిసాన్ మోర్చ ఉపాధ్యక్షులు మోటే శ్రీనివాస్, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు సిలివేరు లింగయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు లెంక పోతుల మధుసుధన్ గౌడ్,మండల ఉపాధ్యక్షులు పల్లె అశోక్,జిల్లా బీజేవైఎం కార్యవర్గ సభ్యులు కానం ఉదయ్ గౌడ్ జిల్లా బీజేవైఎం అధికార ప్రతినిధి మల్తుం కార్ శివాజీ, మండల సోషల్ మీడియా కో కన్వీనర్ సట్లపల్లి మహేష్, మాజీ మండల్ ప్రధాన కార్యదర్శి కొత్తింటి మల్లేష్,శక్తి కేంద్ర ఇన్చార్జిలు బండ వెంకటేష్, రోల్లు రమేష్, బూత్ అధ్యక్షులు సామ శంకర్ రెడ్డి,ఢిల్లీ నాగేశ్వర్, దిద్దెలపోచాలు, ఆకుల గోపాల్,గోగికర్ నర్సింగ్, అమర్నాథ్ రెడ్డి, వజ్రలింగం, పల్లాటి మురళీ, పల్లాటి శేఖర్, బాలస్వామి, శేఖర్,మహిళా నాయకురాలు సరిత, కంలేకర్ నరేష్, కంలేకర్ నాగేష్, నరేష్, తదితరులు పాల్గొనడం జరిగింది.

