భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
షాద్ నగర్, ఏప్రిల్ 5 (మనఊరు ప్రతినిధి): భారత దేశ ఉప ప్రధాన మంత్రి, సమత మూర్తి, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి సందర్భంగా షాద్ నగర్ బ్లాక్ ఆఫీస్ సమీపంలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి టీజేఏసీ మ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా షాద్ నగర్ ఎమ్మెల్యే విర్లపల్లి శంకర్ హాజరై వారి యొక్క మహోన్నత వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ ఎం జనార్ధన్, వైస్ చైర్మన్ కర్ణాకర్, జెఎసి కన్వీనర్ నక్క బాల్ రాజ్, బాదేపల్లి సిద్ధార్థ, చిన్నంతల అనంతం, సత్యం, ఆర్టీసీ అర్జున్ కుమార్, ఆర్టీసీ నర్సింలు, టెలిపోన్ వెంకయ్య, టి. నర్సింలు, బి. నర్సింలు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, టీజేఏసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

