రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బిఆర్ఎస్, అభివృద్ధి వైపు నడిపించిన జెండా గులాబీ

 రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బిఆర్ఎస్, అభివృద్ధి వైపు నడిపించిన జెండా గులాబీ  

బి ఆర్ ఎస్ జెండా ఆవిష్కరణలో కౌన్సిలర్ ప్రశాంత్ రెడ్డి 

రజతోత్సవ సభకు తరలిన పార్టీ శ్రేణులు


జడ్చర్ల రూరల్, ఏప్రిల్ 27 (మనఊరు ప్రతినిధి): స్వరాష్ట్ర సాధన కోసమే ఏర్పడి, రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి వైపు నడిపించిన జెండా బి.ఆర్.ఎస్ పార్టీ అని 24వ వార్డు కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు . బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. అనంతరం వరంగల్ లో జరుగుతున్న బి.ఆర్.ఎస్ రజోత్సవ సభకు పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమారస్వామి, శ్రీనివాస్ యాదవ్ , గడ్డిరాజు, గోపాల్ రెడ్డి, ప్రవీణ్, ప్రసాద్, శ్రీను, నారాయణ, రవికాంత్, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.