బసవేశ్వరుడు ఒక గొప్ప సామాజిక సంస్కర్త యువ నాయకులు బాదిమి దృవ

 బసవేశ్వరుడు ఒక గొప్ప సామాజిక సంస్కర్త* 

 జడ్చర్ల వీర శైవ లింగాయత్ యువ నాయకులు బాదిమి దృవ

 *జడ్చర్లలో వీరశైవ సమాజం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు* 

 హాజరైన పట్టణ ప్రముఖులు, అధికారులు

జడ్చర్ల రూరల్, ఏప్రిల్ 30 (మనఊరు ప్రతినిధి): బసవేశ్వరుడు ఒక గొప్ప సామాజిక సంస్కర్త, తత్వవేత్త, కవి, వీరశైవ మతానికి పునాది వేశాడనీ జడ్చర్ల వీర శైవ లింగాయత్ యువ నాయకులు బాదిమి దృవ కొనియాడారు. బుధవారం పట్టణంలో వీర శైవ సమాజ నాయకుల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో 892వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్చర్ల వీర శైవ లింగాయత్ యువ నాయకులు బాదిమి దృవ, సభ్యులు, తదితరులు నివాళి అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఆయన 12వ శతాబ్దంలో కర్ణాటకలో జన్మించి, కుల, మత, వర్ణ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడాడనీ బసవేశ్వరుడు గొప్ప వ్యక్తి అని చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయని వాటిని వివరించారు. సామాజిక సంస్కరణలలో భాగంగా బసవేశ్వరుడు కుల, మత, వర్ణ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడాడనీ, ఆయన కులాంతర వివాహాలను ప్రోత్సహించి, అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడాడనీ కొనియాడారు.

బసవేశ్వరుడు తత్వవేత్తగా, ఆయన వచనాలలో సమానత్వం, ప్రేమ, సహనం వంటి విలువలకు ప్రాముఖ్యత ఇచ్చాడనీ కవిగా బసవేశ్వరుడు కన్నడ భాషలో అనేక వచనాలు రాశాడనీ ఇవి ఆయన ఆలోచనా ధోరణిని, సామాజిక అవగాహనను తెలియజేస్తాయన్నారు. వీరశైవ మత స్థాపకుదిగా

బసవేశ్వరుడు శివభక్తిని, మతపరమైన స్వేచ్ఛను ప్రోత్సహించాడు, వీరశైవ మతాన్ని స్థాపించి, దానికి ఒక కొత్త రూపాన్ని ఇచ్చాడన్నారు. బసవేశ్వరుడు సామాజిక లోపాలపై ప్రతిఘటించారు. ఆ రోజుల్లో ఉన్న సాంఘిక, మతపరమైన దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడి, ప్రజలకు ఒక నూతన మార్గం చూపాడనీ, మహిళలా విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశాడన్నారు. బాల్య వివాహలను నివారించడానికి ఎంతో కృషి చేశాడని జడ్చర్ల వీర శైవ లింగాయత్ యువ నాయకులు బాదిమి దృవ వివరించారు. అలాగే గణేష్ మందిరంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల వీర శైవ లింగాయత్ సీనియర్ భాద్మి రవిశంకర్,  టౌన్ ప్రెసిడెంట్ కే కిరణ్ కుమార్ కమిటీ సభ్యులు ప్రేమ్, సీనియర్ జర్నలిస్ట్ తాంబూలం శ్రీనివాస్, భాద్మి శశాంక్, రజనీకాంత్, కార్తీక్, అమర్నాథ్, సురేష్, బాబన్న, తదితరులు పాల్గొన్నారు.