*ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ వర్ధంతి*

 *ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ వర్ధంతి*

*నివాళులర్పించిన జై గౌడ ఉద్యమం నాయకులు...*


నాగర్ కర్నూలు, ఏప్రిల్ 2 (మనఊరు ప్రతినిధి): సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 315 వర్ధంతి సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పాత మార్కెట్ యార్డ్ చౌరస్తా లోగల సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద బుధవారం నాడు

జై గౌడ ఉద్యమం నాగర్ కర్నూల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నాగర్ కర్నూల్ జై గౌడ ఉద్యమం జిల్లా అధ్యక్షుడు తమటం వెంకట్ స్వామి గౌడ్ మాట్లాడుతూ తొలి తెలుగు బహుజన చక్రవర్తి సర్వాయి పాపన్న గౌడ్ అని,గోల్కొండ కోటని ఏలిన వారని, మహారాజ్ మొగలాయి పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడని,దక్షిణ భారత సింహం పీడిత వర్గ పోరాటయోధుడు గోల్కొండ కోటపై బహుజన జండా ఎగురవేసిన పోరాట యోధుడు శ్రీశ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ అని అన్నారు. చదువు లేకున్నా సామాన్యులు గురించి అనూహ్యమైన పోరాటం చేసి రాజ్యాన్ని ఏలొచ్చు అని నేర్పిన చరిత్రకారుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహారాజ్ అని కొనియాడారు. నాగర్ కర్నూల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సోమ ప్రగతిగౌడు మాట్లాడుతూ తెలంగాణ తొలి రాజు బహుజన రాజ్యాధికార పోరాటయోధుడు మొగులై దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. గౌడ కులస్తులందరూ ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమ నాగర్ కర్నూల్ కార్యదర్శి దగడాల సుదర్శన్ గౌడ్, కొల్లాపూర్ తాలూకా అధ్యక్షుడు సురగౌని వెంకటస్వామిగౌడ్ ఉపాధ్యక్షురాలు జ్యోతిగౌడ్, శివయ్య గౌడ్, సంజీవగౌడ్, సురేందర్ఆచారి, ఎం. కృష్ణయ్య గౌడ్, ఏ.వెంకటస్వామిగౌడ్, మాచర్ల శ్రీనివాస్ గౌడ్, గుండ్రాతి భాస్కర్ గౌడ్, ఎన్ నరసింహగౌడ్, ప్రగతి, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.