సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన బండి రమేష్

 సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన బండి రమేష్



కూకట్ పల్లి, ఏప్రిల్ 27 (మనఊరు ప్రతినిధి): కూకట్ పల్లి నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు సంబంధించిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 17 మంది లబ్ధిదారులకు సుమారు రూ.7లక్షల 20 వేల రూపాయల విలువ గల చెక్కులను ఆదివారం కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీ లోని గొట్టుముక్కల వెంకటేశ్వరరావు కార్యాలయం వద్ద కూకట్ మల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వరరావు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బండి రమేష్ కి , జివిఆర్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి డివిజన్ అధ్యక్షులు మేకల రమేష్, గోవింద్ గౌడ్, ఆర్. వాసు మల్లేష్ యాదవ్, రాజు యాదవ్, రమణ, నరేందర్, బండి సుధ, జ్యోతి, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.