పేదలకు నాణ్యమైన తిండి పెట్టడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

 పేదలకు నాణ్యమైన తిండి పెట్టడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి

భూత్పూర్, ఏప్రిల్ 4 (మనఊరు ప్రతినిధి): పేద‌ల‌కు క‌డుపు నిండా తిండి పెట్ట‌డ‌మే కాంగ్రెస్ ప్ర‌భుత్వం ధ్యేయ‌మ‌ని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని గోపులాపూర్ గ్రామంలో పేద‌ల‌కు స‌న్న‌బియ్యం పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రేష‌న్ ద్వారా స‌న్న‌బియ్యం ప‌థ‌కం అమ‌లు చేయ‌డం చారిత్రాత్మ‌క‌మ‌ని, రేషన్‌ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోనే అని అన్నారు. ఇచ్చిన హామీల‌ను ఒక్కోక్క‌టి అమ‌లు చేస్తున్నామ‌ని, అర్హులైన పేద‌ల‌కు త్వ‌ర‌లోనే ఇందిర‌మ్మ ఇండ్లు, రేష‌న్ కార్డులు అందిస్తామ‌ని చెప్పారు.


    పాలమూరు అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు 


 పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచేందుకు ప్రత్యేక నిధులు తీసుకొస్తానని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మాసూద్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఏటా 100 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యగురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ లిక్కినవీన్ గౌడ్, పోతులమడుగు మాజీ సర్పంచ్ హర్యానాయక్, లిక్కి విజయ్, లాలునాయక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.