క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల వివరాలను తెలపండి

 క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల వివరాలను తెలపండి 

ఇంటింటికి వెళ్లి సర్వే చేయనున్న క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బంది 

 లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ టి. ప్రసన్న

బిజినపల్లి, ఏప్రిల్ 27 (మనఊరు ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, ఆదేశాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశానుసారం మేరకు ఈనెల 28నుండి మే నేల 2 వరకు మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో గ్రామాలను గిరిజన తండాల్లో ఇంటింటికి వెళ్లి క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల వివరాలను సేకరించనున్నారని లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ టి.ప్రసన్న ఒక ప్రకటనలో తెలిపారు. వైద్యాధికారి డాక్టర్ టి ప్రసన్న మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో త్వరలో క్యాన్సర్ రోగులకు కీమో థెరపీ చికిత్స ప్రారంభించనున్నారని, కావున క్షేత్ర స్థాయి సిబ్బంది ఇంటింటికి వెళ్లి 

క్యాన్సర్ కీమోథెరపీ, రేడియోథెరపీ,శస్త్ర చికిత్స చేయించుకున్న వారి వివరాలు మరియు పాలియేటివ్ కేర్ ( రోగులకు ఉపశమన సేవలు) అవసరం ఉన్న రోగుల వివరాలు అనగా పక్షవాతం, అనారోగ్యంతో మంచం పై ఉన్న రోగుల వివరాలను సేకరిస్తారు. కావున లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య పరిధిలో గల గ్రామస్తులు సహకరించి 

సర్వేకు వచ్చిన వైద్య సిబ్బందికి క్యాన్సర్ రోగుల వివరాలు తెలుపలని ఆమె కోరారు.