రజతోత్సవ సభను విజయవంతం చేయాలి బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు వీరాచారి

 రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు వీరాచారి

బిజినపల్లి, ఏప్రిల్ 21 (మనఊరు ప్రతినిధి): వరంగల్లులో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, మాజీ వార్డు సభ్యులు వీరాచారి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రిజనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో మండలం, ప్రతి గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.