జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఆరాధ్య
జడ్చర్ల రూరల్, ఏప్రిల్ 21 (మనఊరు ప్రతినిధి): రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయిలో నిర్వహించిన గణితం, సైన్స్ క్విజ్ పోటీల్లో పెద్దఆదిరాల జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఆరాధ్య ప్రతిభ కనబర్చి ద్వితీయ స్థానంలో నిలి చారు. ఏఏంవో దుంకుడు శ్రీనివాస్ సోమవారం జిల్లా స్థాయి పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినికి బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్ధినిఆలఆధ్యను జీహెచ్ఎం మల్లయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.
