కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
*కెసిఆర్ మహిళలను కించపరుస్తావా..!?*
*చెప్పులు, చీపుర్లతో బుద్ధి చెబుతాం అంటూ హెచ్చరిక*
*మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు జె. నాగమణి*
పేద మహిళలల ప్రభుత్వ రథం ఆర్టీసీ బస్సు*
*మాకు ఆర్టీసీ బస్సులే దిక్కు*
*మహిళలను కించపరుస్తూ మాట్లాడడం కెసిఆర్ కు తగదు*
*కెసిఆర్ కూతురిలా లిక్కర్ స్కామ్ చేసి కార్లు కొనలేదు*
*కెసిఆర్ వెంటనే క్షమాపణ చెప్పకపోతే తగిన గుణపాఠం చెబుతాం
*మాకు ఆర్టీసీ బస్సులే దిక్కు*
*షాద్ నగర్, ఏప్రిల్ 28 (మనఊరు ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలో మహిళలను కించపరిచే విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారని వెంటనే క్షమాపణ చెప్పకపోతే తగిన గుణపాఠం చెబుతామని కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జే నాగమణి డిమాండ్ చేశారు. షాద్ నగర్ కాంగ్రెస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక చౌరస్తాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ మహిళలు దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆందోళనను ఉద్దేశించి జే.నాగమణి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉచితంగా మహిళలకు కల్పించిన బస్సు సౌకర్యం పై కేసీఆర్ రాజకీయంగా మాట్లాడుతూ బస్సుల్లో మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారని మహిళలను అగౌరవపరిచే విధంగా మాట్లాడడం సబబు కాదని పేర్కొన్నారు. మహిళలను ఏ ఉద్దేశంతో అలా మాట్లాడాలని కెసిఆర్ ను మీడియా ముఖంగా నిలదీశారు. కెసిఆర్ కూతురిలా మహిళలు లిక్కర్ స్కామ్ చేయలేదని కోట్ల రూపాయలు కూడా పెట్టలేదని తాము కూడా కోట్ల రూపాయలు సంపాదించి ఉంటే ఆర్టీసీ బస్సుల్లో తిరగకుండా పేద మహిళలు అందరూ కార్లు కొనుక్కునే వారమని ఎద్దేవా చేశారు. నేడు ఆర్టీసీ బస్సులు నిరుపేద మహిళలు ఆధార్ కార్డు సహాయంతో రాష్ట్ర మొత్తం తమ పనులపై తిరుగుతున్నారని ఎంతోమంది శ్రామిక మహిళలు పొట్టకూటి కోసం నిరంతరం పట్టణాలకు పల్లెలకు తిరుగుతూ జీవనోపాధి పొందుతున్నారని మహిళలకు ఆర్థిక భారం తగ్గించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద మహిళల పాలిట దేవుడైతే కేసీఆర్ మాత్రం రాక్షసుడిగా మారుతున్నారని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో తిరుగుతున్న మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ పేద మహిళలకు ఆర్టీసీ సంస్థలకు ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని లేకపోతే గ్రామాల్లో వచ్చే ఎన్నికల్లో తిరగనివ్వకుండా మహిళలు చెప్పులు చీపురు కట్టలతో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో కుందుర్గు మహిళా అధ్యక్షురాలు వజ్రమ్మ కేశంపేట మహిళా అధ్యక్షురాలు అనసూయమ్మ నందిగామ అధ్యక్షురాలు బాలామణి అదేవిధంగా పట్టణ మహిళా అధ్యక్షురాలు చంద్రకళ, పట్టణ మాజీ కౌన్సిలర్ మెహముదా బేగం, మహిళా నాయకురాలు స్రవంతి శంకరమ్మ పర్వీన్ ఫాతిమా శోభ తదితరులు పాల్గొన్నారు.


