ఆలూరు పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహ ఆవిష్కరణ
జడ్చర్ల రూరల్, ఏప్రిల్ 4 (మనఊరు ప్రతినిధి): మండలంలోని ఆలూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 1991-92, 7 వ తరగతి చదివిన పూర్వవిద్యార్థులు ఏర్పాటు చేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాన్ని పూర్వ విద్యార్థులతో కలిసి హెచ్ఎం యుగంధర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాద్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి పదవీ బాధ్యతలు చేపట్టిన గొప్ప విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని తెలిపారు. అలాగే పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తాము చదువుకున్న పాఠశాలకు ఎంతో కొంత చేయూత నివ్వాలని, డాక్టర్ సర్వేపల్లి విగ్రహం ఏర్పాటు చేసామని, తమ గురువులను సన్మానించామని, తమను చూసి ఇప్పటి విద్యార్థులు మంచి భవిష్యత్తును పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం , ఉపాధ్యాయులు అహ్మద్ షరీఫ్, అబ్దుల్ అలీమ్, హరిహరనాథ్, సోమ్ల, హైమావతి, సంధ్య, మంజుల, నిర్మల, రాధిక, పూర్వ విద్యార్థులు మౌలానా, శంకర్, రాజేందర్, వెంకటేష్, నర్సింహులు, నాగరాజు, ప్రమీల, పద్మ, నాగమణి, 30 మంది పూర్వ విద్యార్థులు, విద్యార్థులు, పాల్గొన్నారు.
