రక్త దానం మరొకరికి ప్రాణ దానం
నాగర్ కర్నూల్ డిఎస్పి బి. శ్రీనివాసులు
65 మంది మహిళలకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు.
ఆర్యవైశ్య ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆకుతోట మధుమోహన్...
నాగర్ కర్నూల్, ఏప్రిల్ 29 (మనఊరు ప్రతినిధి): ఒక వ్యక్తి చేసే రక్తదానం మరో వ్యక్తికి ప్రాణదానం అవుతుందని నాగర్ కర్నూల్ డిఎస్పి బి. శ్రీనివాసులు అన్నారు. ఆర్యవైశ్య ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ పుల్లారెడ్డి ఆసుపత్రిలో మంగళవారం నాడు నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని నాగర్ కర్నూల్ డిఎస్పి బి. శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయటవలన వారి రక్తం మరొకరికి ప్రాణం పోస్తుందని, అత్యవసర సమయంలో రక్తం అందజేయడం మహా పుణ్యకార్యం అని అన్నారు. ఎంతోమంది ఆర్గాన్స్ ఇవ్వడానికి సంబంధించి సరైన అవగాహన లేకపోవడంపై చాలామంది మరణించారని చెప్పారు. ఈ మధ్యకాలం చాలా మందిలో అవగాహన వచ్చి రక్తదానం చేయడానికి ఎంతోమంది ముందుకొస్తున్నారన్నారు. ఈ రక్తదాన శిబిరంలో 15 మంది నుండి 15 యూనిట్ల రక్తాన్ని సేకరించి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి అందజేశారు. సామాజిక సేవా తత్పరత కలిగి ఉండి ప్రజా ఆరోగ్యం కాపాడుటలో స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగస్తులు, ఇతరులు సహకరించాలని ఆయన సూచించారు. మహిళలకు నిర్వహించే ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని డాక్టర్ ఎం.పుల్లారెడ్డి ప్రారంభించారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం కాపాడుటలో, వ్యక్తిగతంగా తరచుగా వైద్యులు సూచనలు సలహాలు పొందాలని, వారు సూచించిన పరీక్షలు చేసుకోవడం ఎంతైనా అవసరం అని అన్నారు. 65 మంది మహిళలకు ప్రత్యేకంగా స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ హరిప్రియ ప్రత్యేక వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించి పలు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గోవర్ధన్, జిల్లా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుతోట సాయిబాబు, ఆర్యవైశ్య ఉద్యోగుల సంఘ అధ్యక్షులు మధుమోహన్, కార్యదర్శి కండె సాయి శంకర్, సభ్యులు శ్రీధర్, రాఘవేంద్రస్వామి, రాజేష్, కోట్ర బాలాజీ, మిడిదొడ్డి రాజేష్, డాక్టర్ హరిప్రియ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



