పేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరం

 పేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరం

-డాక్టర్ నరేన్, డాక్టర్ పూర్ణిమ

-ఉచిత వైద్య షిబిరానికి విశేష స్పందన



నాగర్ కర్నూల్, ఏప్రిల్ 28 (మనఊరు ప్రతినిధి): గ్రామీణ ప్రాంతాల పేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు శ్రీ మహావేద హాస్పిటల్ యజమానులు డాక్టర్.నరేన్, డాక్టర్ పూర్ణిమలు అన్నారు. సోమవారం శ్రీ మహావేద హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. జిల్లా కేంద్రంలో శ్రీ మహవేద హాస్పిటల్ ప్రారంభించి మూడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా  పేద ప్రజల సహాయార్థం ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు డాక్టర్ నరేన్, డాక్టర్ పూర్ణిమలు తెలిపారు. ఆరోగ్యం పట్ల గ్రామీణ,‌పట్టణ ప్రజలు నిర్లక్ష్యం, అజాగ్రత్తగా వ్యవహరిస్తారని, వారికి అవగాహన కల్పించేందుకు తరచూ గత మూడు సంవత్సరాల నుంచి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ శిబిరంలో పెద్దలకు హైబిపి, మలేరియా, టైఫాయిడ్, కిడ్నీ, గ్యాస్ ట్రబుల్, కడుపు నొప్పి, డలేరియా, ఛాతినొప్పి, అస్తమా, నిమొనియ, తల నొప్పి,

ఫీట్స్, రక్తహీనత, చిన్న పిల్లలకు జ్వరాలు, డెంగు, మలేరియా, టైఫాయిడ్, నిమొనియా, అస్తమా, డలేరియా ఇతర పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందుల పంపిణితో పాటు ల్యాబ్ టెస్టులకు 50శాతం డిస్కౌంట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల గ్రామీణ పేద ప్రజలు నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా ఉంటారని వారికి అవగాహన కల్పించేందుకు గత మూడుడెండ్లుగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని డాక్టర్ నరేన్ అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పూర్ణిమ మాట్లాడుతూ రోజు మనం తీసుకునే ఆహారం, వాతావరణంలో వస్తున్న మార్పులు, ఇతర కాలుష్యాల వల్ల ప్రతి ఒక్కరు అనారోగ్యం బారిన పడుతున్నారని, ఆరోగ్యంపట్ల ప్రతిఒక్కరు శ్రద్ధ వహించి తరచూ వైద్య పరీక్షలు చేఇంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ రోజు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 150 పైచిలుకు పెద్దలకు, 75 పై చిలుకు చిన్నారులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణి చేసినట్లు తెలిపారు.