ఎండాకాలపు రక్షణ కవచం: పిల్లల ఆరోగ్యానికి తల్లిదండ్రుల పాత్ర*

 *ఎండాకాలపు రక్షణ కవచం: పిల్లల ఆరోగ్యానికి తల్లిదండ్రుల పాత్ర*

*పిల్లలు ఆరోగ్యమే సంపద: వేసవిలో జాగ్రత్తలు తప్పనిసరి*

ఎండాకాలంలో అధికంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే? ఎండలు విపరీతంగా పెరిగే సరికి పిల్లలు, పెద్దలు అందరు కూడా ఎక్కువగా అనారోగ్యానికి గురి అవుతారు.ముఖ్యంగా చిన్నపిల్లలు ఎండ,వేడిమికి తట్టుకోలేక అనారోగ్యానికి త్వరగా గురవుతారు,

వడదెబ్బకు హీట్ స్ట్రోక్ వంటి సమస్యలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కనుక తల్లిదండ్రులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటిస్తే పిల్లలను వేసవికాలంలో ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా రక్షించుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలకు నిమ్మరసం లేదా చల్లని నీరును,పండ్ల రసాలు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవాలు తరచుగా తాగిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురికారు. వేసవికాలంలో పిల్లలు తేలిక పార్టీ నోరు వస్త్రాలు ధరింప చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ముఖ్యంగా తెల్లటి లేదా లైట్ కలర్స్ ఎంపిక చేయాలి.మధ్యాహ్నం సమయంలో పిల్లలను బయటకి తీసుక వెళ్లకూడదు.తప్పనిసరి బయటికి వెళ్లాల్సి వస్తే సాయంత్రం మాత్రమే తీసుకు వెళ్ళాలి. 

ఎండాకాలంలో తేలికపాటి, ఆకుకూరలు,పండ్లు వంటి తేలికైన ఆహారాలు ఇవ్వాలి.ఆయనతో కూడా ఆహార పదార్థాలు పిల్లలకు తినిపించకూడదు. పిల్లలకు శుభ్రత పాటించే అలవాటు చెప్తూ, బయట భోజనం, కలుషితమైన నీరు తాగకుండా జాగ్రత్త పడాలి.

ఎండాకాలంలో పిల్లలకు ఇండోర్ గేమ్స్, పుస్తకాలు, క్రియేటివ్ కార్యకలాపాలకు ప్రోత్సహించాలి.

 అప్పుడే పిల్లలు, పెద్దలు కూడా ఎండాకాలాన్ని ఆరోగ్యంగా,ఆనందంగా గడపగలుగుతారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండడం వల్ల చాలా సమస్యలను ముందుగానే నివారించవచ్చు.

ఎండాకాలంలో సాధ్యమైనంత వరకు విహారయాత్రలకు వెళ్ళకూడదు. ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణలో ఉండే విధంగా చూసుకోవాలి ఒకవేళ బయటకి కచ్చితంగా తీసుకెళ్లాల్సిన అవసరం వస్తే ఉదయం సమయంలోనే తీసుకెళ్లి వారికి కావలసిన వస్తువులను కొని ఇచ్చి తొందరగా ఇంటికి తీసుకొని వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా ఏప్రిల్ మే నెలలో అధికంగా ఎండల తీవ్రత ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు కచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లలతో పాటే ఎక్కువ సమయాన్ని ఇంట్లోనే గడిపే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అప్పుడే తాము తమ పిల్లలు బాగుంటారు. ఇకనైనా తల్లిదండ్రులు ఎండాకాలంలో జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి.

వ్యాసకర్త 

వి. జానకి రాములు గౌడ్ 

లింగంధన.

Previous Post Next Post