వాటర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి భూమిపూజ

శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో వాటర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి భూమిపూజ






ఉర్కొండ, ఏప్రిల్ 5 (మనఊరు ప్రతినిధి): మండలంలోని ఊర్కొండపేట శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం రక్షిత త్రాగునీటి కోసం టాస్క్ సిఓఓ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సమకూర్చిన రూ.5లక్షలతో చేపడుతున్న మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ఆయన శనివారం భూమి పూజ చేశారు. అంతకు ముందు శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ చేశారు. ‌ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తమ ఇష్టదైవం శ్రీ పబ్బతి ఆంజనేయస్వామిస్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, అలాగే దేవాలయ కమిటీ విజ్ఞప్తిమేరకు భక్తుల సౌకర్యార్థం ఐక్యత ఫౌండేషన్ సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి పూజ చేయడం జరిగిందని, ఎంతో ప్రాముఖ్యత కలిగిన పబ్బతి ఆంజనేయస్వామి వారికి తన వంతు సేవ చేసుకొనే భాగ్యం దక్కడం సంతోషంగా ఉందని తెలిపారు. దేవాలయానికి సంబంధించి ఎలాంటి సహకారానికైన ముందుటామని తెలిపారు. అంతకుముందు ఆయనకు అర్చకులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పాలకమండలి చైర్మన్ సత్య నారాయణ రెడ్డి, ఈ.వో సత్య చంద్రారెడ్డి, ఊరుకొండ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ధ్యాప నిఖిల్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి, అయూబ్ పాషా, రమేష్ నాయక్, అబ్దుల్ సమీ, గోపి, శ్రీనివాసులు, యూత్ ప్రెసిడెంట్ ఆదినారాయణ, వహీదోద్దీన్, మనోహర్ రెడ్డి, ఆరిఫ్, పాలకమండలి సభ్యులు ఆలయ అర్చకులు దత్తాత్రేయశర్మ, మహేష్, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.