దేశంలోనే సన్నబియ్యం పథకం చారిత్రాత్మకం

 దేశంలోనే సన్నబియ్యం పథకం చారిత్రాత్మకం


వనపర్తి, ఏప్రిల్ 2 (మనఊరు ప్రతినిధి): భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ధనికులు తినే సన్నబియ్యాన్ని పేదలకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పట్టణంలోని 1,9,20, రేషన్ షాపుల్లో బుధవారం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. సన్నాబియ్యంతో వండిన అన్నంను స్వయంగా అందరికి వడ్డీంచి ఎమ్మెల్యే మేఘరెడ్డి కూడా అందరితో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పేదల కోసం మహత్తరమైన పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్రంలో దారిద్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా తినదగిన బియ్యం సరఫరా చేస్తామన్నారు. ఈ పథకం పేదల గుండెల్లో నిలిచే పథకమని ఎమ్మెల్యె కొనియాడారు. ఈ పథకాన్ని పేద ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో అర్హులైన పేద ప్రజలందరికీ రేషన్ కార్డుల పంపిణీ చేస్తుంద‌ని తెలిపారు. దొడ్డు బియ్యం పంపిణీతో అనుకున్న లక్ష్యం నెరవేరలేదన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త, లాకాకుల సతీష్, వై స్ చైర్మెన్ పాకనాటి కృష్ణయ్య, మాజీ కౌన్సిలర్స్ చుక్కరాజు, బి. వెంకటేష్, ఎరపుల రవియాదవ్, నక్కారాములుయాదవ్, జంపన్న యాదవ్, చీర్ల సత్యం, వినోద్, గంధంకృష్ణ, భాషనాయక్, వాకిటి ఆదిత్య, సినియర్ నాయకుడు యం డి. రహీం, బొంబాయి మన్యం కొండా, పి.రంజిత్ కుమార్, రఘుయాదవ్, అర్. టి. కిరణ్, పోలేపల్లి మోహన్ రాజు, నాయకులు, కార్యకర్తలు, డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.