సన్న బియ్యం పంపిణీ చరిత్రలో నిలిచిపోయే పథకం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

 సన్న బియ్యం పంపిణీ చరిత్రలో నిలిచిపోయే పథకం

దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

భూత్పూర్, ఏప్రిల్ 1 (మనఊరు ప్రతినిధి): సన్న బియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవ పథకమని,చరిత్రలో నిలిచిపోయే పథకమని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం పంపిణీలో భాగంగా మంగళవారం ఆయన భూత్పూర్ మండలంలోని తాటికొండ గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సన్న బియ్యం పంపిణీ పట్ల తాటికొండ మహిళలు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు సైతం పెద్దల మాదిరిగానే సన్న బియ్యం తినాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. శ్రీమంతులే కాదు పేదలు కూడా సన్న బియ్యం తినాలన్నది ప్రజా ప్రభుత్వ ఆకాంక్ష. ఆహార భద్రత చట్టం తీసుకువచ్చి, రేషన్ షాపులు ప్రారంభించిన ఘనత కాంగ్రెస్ పార్టీది - దేశంలోనే పేదలకు సన్న బియ్యం ఇస్తున్న ఘనత ప్రజా ప్రభుత్వానిది. పండుగనాడే కాదు..పేదలు ప్రతిరోజూ సన్న బియ్యం తినాలన్నా సంకల్పంతో సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టామని,.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 లకే గ్యాస్ సిలిండర్, 2 లక్షల రుణమాఫీ, వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ పథకాలను ఇప్పటికే ప్రారంభించామని, ఒక్క తాటికొండ గ్రామంలోనే రైతులకు 2కోట్ల 72లక్షల93980 రూపాయల రుణమాఫీ చేసాం. 629 కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 180 కుటుంబాలకు 500 లకే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నామని చెప్పారు.

51 మంది రైతులకు 10 లక్షల 40 వేల రూపాయల వరి పంటకు సంబంధించిన బోనస్ చెల్లింపులు చేశాము.1223 రైతులకు 1కోటి61 లక్షల రూపాయల రైతు భరోసా వారి అకౌంట్ లలో వేశామని, 187 కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు. దేశ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో రైతులకు ఏక కాలంలో 21 వేల కోట్లతో 25 లక్షల మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశాం. బిఆర్ఎస్ పదేళ్లు చేయలేనిది ఒక్క సంవత్సరం లో చేసి చూపించాం... అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే 58000 వేల ఉద్యోగాలు ఇచ్చాము. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల లబ్ధి జరుగుతుంది, ఎవరికైనా అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు అందని వారు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ లు పెట్టుకోవచ్చు, సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ గా కొనసాగుతున్న వారు తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే అక్రమంగా కోట్ల రూపాయలు ఆర్జించాడే కానీ తాటికొండ గ్రామానికి మాజీ ఎమ్మెల్యే చేసిందేమీ లేదని,... తాటికొండ గ్రామంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు.రాష్ట్రాన్ని దోచుకుని, అప్పులు చేసి బిఆర్ఎస్ ప్రభుత్వం చిప్ప చేతికిచ్చింది, అయినా ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని,నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తున్నారని, ఆశీర్వదించండి అని - మన ముఖ్యమంత్రి పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డికి అండగా ఉండాలని తెలుపుతూ తదనంతరం భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో సన్న బియ్యం పథకాన్ని దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జియంఆర్ ప్రారంభించారు.