రాందేవ్ ఆసుపత్రి సేవలు అద్భుతం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సతీష్ రెడ్డి

 రాందేవ్ ఆసుపత్రి సేవలు అద్భుతం

 మున్సిపల్ కార్మికులకు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం

కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి




కూకట్ పల్లి, ఏప్రిల్ 27 (మనఊరు ప్రతినిధి): కూకట్ పల్లి ప్రాంతంలో రోగులకు విశేష సేవ అందిస్తున్న రాందేవ్ ఆసుపత్రి సేవలు అద్భుతం అని కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి అన్నారు. ఆదివారం రాందేవ్ ఆసుపత్రిలో మున్సిపల్ కార్మికుల మెగా వైద్య శిబిరం కార్యక్రమంలో స్కానింగ్ విభాగాన్ని శేరి సతీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాందేవ్ ఆసుపత్రి రోగులకు సేవలు అందిస్తూనే సమాజానికి సేవలు అందిస్తున్న జర్నలిస్టులు, పోలీసులతో పాటు మున్సిపల్ కార్మికులకు ఉచిత వైద్య శిబిరం ద్వారా రోగాల నిర్ధారణ చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం హర్షించదగ్గ పరిణామం అన్నారు. సమాజ హితానికి కృషి చేస్తున్న రాందేవ్ ఆసుపత్రి వైద్య సారధులు డాక్టర్ కమలాకర్ రావు, సీఈవో డాక్టర్ యోబులతో పాటు వైద్య బృందాన్ని అభినందించారు. ఇలాంటి వైద్య శిబిరాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ మేకల మైఖేల్, కెపిహెచ్బి డివిజన్ ప్రెసిడెంట్ తమ్మినేని ప్రవీణ్ కుమార్, కొమ్ము బాబు, రామకృష్ణారెడ్డి, గిరి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.