పేహెల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య.!

 పేహెల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య.!



హైదరాబాద్, ఏప్రిల్ 26 (మనఊరు ప్రతినిధి): జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పెహెల్గంలో ఈ నెల 23న 26 మంది టూరిస్టులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడం హేయమైన చర్య అని పి ఎం ఎస్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు సుధారాణి కృష్ణంరాజు అన్నారు. హైదరాబాద్ లోని బడంగ్ పేట్ జైసూర్య పట్నంలో శుక్రవారం పి ఎం ఎస్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పహిల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన హింసాత్మక ఘటనలో పర్యాటకులపైన కాల్పులు జరిపి ప్రాణాలను బలి చేసిన చర్యలను ఖండిస్తూ మృతి చెందిన వారికి అశ్రు నివాళి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం లౌకిక దేశంగా కుల మతాలకు అతీతంగా అందరినీ అక్కున చేర్చుకుని ప్రపంచ శాంతికి సహకారం అందించడంలో మన భారత దేశం ముందుంటుందన్నారు. మానవత్వాన్ని శాంతిని బలహీనతగా భావించి కాశ్మీర్ లోని పహాల్గాంలో అలజడి సృష్టించిన ఉగ్రవాదులు పెళ్ళి జరిగిన మూడు రోజులకే నూతన దంపతులలో భర్తను పొట్టన పెట్టుకున్నారని అన్నారు. మరొక కుటుంబానికి తండ్రిని లేకుండా చేసి ఆ కుటుంబానికి తీరని వ్యధ మిగిల్చిన ఉగ్రవాదులు చనిపోయిన కూడా వదలకుండా మరొక సారి కాల్పులు జరపడం నిజంగా క్షమించరాని నేరం చేశారు. ఒక వైపు మనుషుల ప్రాణాలు పోతుంటే మరొక వైపు సంతోషంగా పండుగ చేసుకోవడం ఎంత వరకు సమంజసమన్నారు. భారతీయుల మంచితనం చేతకాని తనంగా భావించే ఉగ్రవాదులపై ఉక్కు పాదం మోపి మన దేశం వైపు చూడాలంటే ఒక సింహ స్వప్నం కావాలన్నారు. ఆ విధంగా మన సైన్యం వారిని కూడా మట్టు పెట్టి మన భరత మాత రుణం తీర్చుకోవాలని తెలిపారు. అందరు దీనిని ఖండించాలని అన్నారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా దీనిని వ్యతిరేకించాలని కోరారు. ఉగ్రవాదం నశించాలి మానవత్వం మేల్కొనాలి, ఉగ్రవాదులపై ఉక్కు పాదం మోపాలి నినాదాలు చేస్తూ ఉగ్రవాదుల ఘాతుకానికి బలైన వారికి వీరందరు అశ్రు నివాళి అర్పించారు. మేరా భారత్ మహాన్ ,హిందూస్తాన్ జిందాబాద్, జైహింద్,అనే నినాదంల తో ర్యాలీ ని నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో శ్రీదేవి, కృప, శ్రీనివాస్, నాగేందర్, సెల్వ రాజు, మేరి, కళ, రిషిత, చిరంజీవి, లక్ష్మి , సుబ్బలక్ష్మి, ఆర్య, నిర్విజ్జ, రిచర్డ్ సన్నీ తదితరులు పాల్గొన్నారు.