అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం...
హాజరైన నారాయణ ఎమ్మెల్యే సంజీవరెడ్డి..
పెద్ద శంకరంపేట్... శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని పెద్ద శంకరంపేట లోని రామాలయం ఆవరణలో ఆదివారం సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.. వేద బ్రాహ్మణ పండితుల మంత్రోచ్ఛారణలతో సాంప్రదాయ బద్ధంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు.. భక్తులకు సీతారాముల కళ్యాణ మహోత్సవం తిలకించడానికి ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా భారీ ఎల్ఈడి స్క్రీన్ ను ఏర్పాటు చేశారు.. ప్రత్యేకంగా వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన పూల పందిరిలో సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది.. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు... భక్తులందరికీ శ్రీ సరస్వతి శిశు మందిరం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

