*తెలంగాణ టీవీ రంగస్థలం అభివృద్ధి సంస్థ హైదరాబాద్ వారి సౌజన్యంతో*
*బూర్గుల గ్రామ ప్రజల సహకారంతో శ్రీరామ భజన మండలి నిర్వహణలో*
*శ్రీ కళాజ్యోతి సాంస్కృతిక సంస్థ షాద్‌నగర్ వారి ఆధ్వర్యంలో*
*శ్రీరామాంజనేయ యుద్ధం పౌరాణిక పద్య నాటకం పాండవ ఉద్యోగం నుండి ద్వారక దృశ్యం మరియు అశ్వద్ధామ ఏకపాత్ర*
*ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు రంగస్థలం నటులు టీవీ రంగయ్య
*మరొక అతిథి పాలమూరు కళాకారుల ప్రధాన కార్యదర్శి వి నారాయణచారి, షాద్ నగర్ రంగస్థలం గౌరవాధ్యక్షులు రంగనాథం
షాద్ నగర్, ఏప్రిల్ 6 (మనఊరు ప్రతినిధి): షాద్ నగర్ నియోజకవర్గంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఫరూక్ నగర్ మండలం బూర్గుల గ్రామంలో పౌరాణిక పద్య నాటకం ప్రదర్శనలు జరిగాయి బూర్గుల గ్రామ ప్రజల సహకారంతో తెలంగాణ టీవీ మరియు రంగస్థలం అభివృద్ధి సంస్థ హైద్రాబాద్ వారి సౌజన్యంతో, శ్రీరామ భజన మండలి బూర్గుల వారి నిర్వహణలో శ్రీ కళాజ్యోతి సాంస్కృతిక సంస్థ షాద్‌నగర్ వారి ఆధ్వర్యంలో జరిగిన శ్రీరామాంజనేయ యుద్ధం మరియు పాండవోద్యోగం నుండి ద్వారకా దృశ్యం,అశ్వత్థామ ఏకపాత్రాభినయం ప్రదర్శనలు జరిగాయి. ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన శ్రీ రామాంజనేయ యుద్ధo నాటక సన్నివేశాలు. రామ నామమా లేక రామ బాణమా అంటూ ఆంజనేయుడి పాత్ర ధారి కళాజ్యోతి వ్యవస్థాపక అధ్యక్షులు జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీ వడ్ల రమేశ్ చారి నటన అభినయం బూర్గుల గ్రామస్తులను, వివిధ కళాకారులను ఆకట్టుకున్నారు. సంగీత వాయిద్య కారుడు హార్మోనిస్ట్ శ్రీ మాధవరాజు తెలగాణ రాష్ట్ర ఉత్తమ సంగీత గ్రహీత,మరియు డోలక్ వాయిద్యముతో మల్లారెడ్డి గారు తిరికిత ముక్తాయింపులతో ప్రేక్షకులకు మంచి మ్యూజిక్ అందించారు. ఈ కార్యక్రమానికి మదులాపురం భజన మండలి, గంట్లవెల్లి ప్రజలు, పుట్టోడ్నిగూడ, కొత్తపేట, కొత్తూరు, నవాబ్‌పేట్, ఇప్పటూర్, శ్రీరంగాపురం, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాజ్యోతి సంస్థ అభిమానులు, పురుషోత్తమచారి, పాపన్నగౌడ్, ఆంజనేయులు, నర్సింలు, యాదగిరి, మల్లారెడ్డి, రవీందర్, పాల్గొన్నారు.





