శ్రీ దత్త సాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు భక్తులకు అన్నసంతర్పణ

 శ్రీ దత్త సాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు 

భక్తులకు అన్నసంతర్పణ 


చిలకలూరిపేట, ఏప్రిల్ 3 (మనఊరు ప్రతినిధి): శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసియున్న శ్రీ దత్త సాయి సన్నిధిలో ఈరోజు గురువారం పురస్కరించుకొని శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక అర్చన పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది, భక్తులు పాల్గొని శ్రీ దత్త సాయికి ప్రత్యేక ప్రదక్షిణ పూజా కార్యక్రమం నిర్వహించి దీప కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు దాతలు, చిలకలూరిపేట పట్టణ ప్రజల సహాయ సహకారాలతో అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది, అనంతరం శ్రీ దత్త సాయి సన్నిధి నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని, సద్గురు సన్నిధిలో స్వీకరించే అన్న ప్రసాదం గురువు యొక్క అనుగ్రహంతో సకల రోగాలను నశింపజేసి ఆయురారోగ్య భోగభాగ్యాలను కలగజేస్తుందని తెలిపారు, శ్రీరామనవనమి రోజున ఉదయం 8 గంటలకు శ్రీ దత్త సాయి కి గంధాభిషేక పూజ జరుగుతుందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ పాల్గొని గురు రూపమైన గంధాన్ని ఇంటికి తీసుకెళ్ళి సకల శుభాలు పొందవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు అయినవోలు హనుమంతరావు, తదితర మహిళా భక్తులు పాల్గొన్నారు.