పాపన్నగౌడ్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

 పాపన్నగౌడ్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

 జాతీయ మానవహక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ హైమావతి


ఖమ్మం, పెనుబల్లి, ఏప్రిల్ 2 (మనఊరు ప్రతినిధి): సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ ఆశయ సాధనకు కృషి చేయాలని జాతీయ మానవహక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ హైమావతి అన్నారు. బుధవారం జిల్లాలోని పెనుబల్లి మండలం వంగముత్యాల బంజార గ్రామంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసే ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి చలమాల విట్టల్ రావు సభాధ్యక్షతవహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఔరంగజేబును ఓడించి గోల్కొండ కోటను జయించిన ధీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ అని అన్నారు. పేదల పాలిట పెన్నిధి సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను స్మరించుకుంటూ గౌడ సమాజ ప్రతినిధులు ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు. కులం, మతం, జాతి విభేదాలు సమసమాజ నిర్మాణ స్థాపన కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని కొనియాడారు. సర్వాయి పాపన్న 17వ శతాబ్దంలో బహుజన రాజుగా చరిత్రలో నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాతలు వేముల నరసింహారావు, వేముల బాబురావు, విగ్రహ కమిటీ చైర్మన్ వంగా గిరిజాపతి రావు, విగ్రహ కమిటీ సభ్యులు బజ్జూరి నాగేశ్వరరావు, మల్లెల శ్రీనివాసరావు, వంగా చంద్రశేఖర్ గౌడ్, మండల ప్రముఖులు వంగా దామోదర్ రావు, కనగాల సాంబశివరావు, కోటగిరి సుధాకర్ బాబు, బీసీ సంఘం నాయకులు కొప్పుల గోవిందరావు, గోపిశెట్టి వెంకటేశ్వరరావు, పంతంగి వెంకటేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నల్లమల అరుణ్ ప్రతాప్, ఎస్ టి ఎస్ సి సంఘం నాయకులు మంగు నాయక్, తడకమళ్ళ చిరంజీవి, గౌడ సంఘం నాయకులు బజ్జూరి వెంకటేశ్వరరావు, వేముల కృష్ణయ్య, వంగ వెంకటేశ్వర్లు, వేముల వెంకటేశ్వరరావు, వంగా సురేష్, వంగా చింపయ్య, పులిచెర్ల నాగప్రసాద్, వంగా చెన్నారావు, వంగా షణ్ముఖ కుమార్, వంగ సుభాష్ గౌడ్, దొంతు మాధవ్, వేముల రవికుమార్, పంది తిరుపతయ్య, కొనకళ్ళ వెంకటస్వామి,బెజవాడ కోటేశ్వరరావు, వేముల చిన్న బాబురావు, వేముల పండు, గోదా శ్రీనివాసరావు, మరీదు, చంద్రశేఖర్, పులిచర్ల నారాయణ, షేక్ అబ్దుల్, చిట్లూరి సత్యనారాయణ, శాంతి స్టూడియో జిల్లా నాయకులు ప్రసాద్, డాక్టర్ జాఫర్ అలీ, గౌడ ప్రతినిధులు, పలువురు, పాల్గొన్నారు.