రాష్ట్రాన్ని సాధించిన పార్టీ, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ వైస్ ఎంపీపీ వెంకటాచారి
పెద్దాయపల్లి చౌరస్తాలో ఘనంగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు*
*వరంగల్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు*
బాలానగర్, ఏప్రిల్ 27 (మనఊరు ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన పార్టీ, సకలజనులకు సంపూర్ణ సంక్షేమాన్ని అందించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ వైస్ ఎంపీపీ వెంకటాచారి అన్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం మండల కేంద్రంలోని పెద్దాయపల్లి చౌరస్తాలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చిరకాల వంచను నెరవేర్చి, ప్రత్యేక రాష్ట్రాలు సాధించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కిందని మాజీ వైస్ ఎంపీపీ వెంకటాచారి అన్నారు. స్వరాష్ట్రంలో కెసిఆర్ పాలనలో అభివృద్ధిలోనే రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపాడని అన్నారు. కెసిఆర్ పాలన తీరు దేశానికి ఆదర్శంగా నిలిచిందని, సకలజనులకు సంక్షేమ అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, బీసీ బందు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కెసిఆర్ కిట్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజల అభివృద్ధికి దోహదపడ్డాయని అభిప్రాయపడ్డారు. కెసిఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ అని, ఎప్పటికైనా తెలంగాణ ప్రజల బాగోగులను చూచే ఏకైక పార్టీ గులాబీ పార్టీ అని అన్నారు. తెలంగాణ ప్రజల పార్టీ రజతోత్సవ వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని, రజతోత్సవాన్ని తెలంగాణ ప్రజలు పండుగల భావిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే వరంగల్లో నిర్వహిస్తున్న రజోత్సవ వేడుకలకు మండలం నుంచి వేలాది మంది కార్యకర్తలు తరలి వెళ్లారు. సభకు వెళ్తున్న వాహనాలకు మాజీ వైస్ ఎంపీపీ వెంకటాచారి జెండాను ఊపి స్వాగతం పలికారు. ప్రతి పల్లె నుంచి గులాబీ దండు వరంగల్ సభకు తరలివచ్చారని ఈ సందర్భంగా పలువురు నాయకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
