ఆలూరులో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జడ్చర్ల రూరల్, ఏప్రిల్ 4 (మనఊరు ప్రతినిధి): మండలంలోని ఆలూరు పాఠశాలలో 1991-92, 7 వ తరగతి చదివిన పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి పూర్వ ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, నారాయణలను సన్నానించారు. అనంతరం వారి జ్ఞాపకాలను విద్యార్థులతో ఉపాధ్యాయులు పంచుకున్నారు. విద్యార్థిని, విద్యార్థులు వారు చదువుకున్న రోజుల్లో కొన్ని సంఘటనలను గర్తు చేసుకొని సాయంత్రం వరకు సంతోషంగా గడిపారు. పూర్వ ఉపాధ్యాయులు మాట్లాడుతూ 33 సంవత్సరాల తరువాత తమను గుర్తించుకొని పిలిచి నందుకు సంతోషంగా వుందని, తమ కృషిని విద్యార్థులు గుర్తించారని, వారి కి శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం యుగంధర్, ఉపాధ్యాయులు అహ్మద్ షరీఫ్, అబ్దుల్ అలీమ్, హరిహరనాథ్, సోమ్ల, హైమావతి, సంధ్య, మంజుల, నిర్మల, రాధిక, పూర్వ విద్యార్థులు మౌలానా, శంకర్, రాజేందర్, వెంకటేష్, నర్సింహులు, నాగరాజు, ప్రమీల, పద్మ, నాగమణి, 30 మంది పూర్వ విద్యార్థులు, విద్యార్థులు, పాల్గొన్నారు.
