మద్దిమడుగు అంజన్న జయంతి ఉత్సవాలు..
అధిక సంఖ్యలో తరలిరానున్న భక్తులు
అచ్చంపేట, ఏప్రిల్ 9 (మనఊరు ప్రతినిధి): నల్లమల ప్రాంతంలోని నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు గ్రామంలో వెలసిన పిలిస్తే పలికే భక్తుల కొంగుబంగారం గా పిలువబడుతున్న శ్రీ పబ్బతి మద్దిమడుగు ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు ఈనెల 10 నుంచి 12 వరకు కార్యక్రమాలు అంగరంగ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వైభవంగా ఆంజనేయ మాలధారణ ధరించిన భక్తులు 41 రోజుల పాటు కఠోర మాల దీక్ష చేపట్టి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు మాలవిరవణ కార్యక్రమం చేస్తారు. ఈ జయంతి వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుండి అత్యధికంగా హాజరు కారున్నారు. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామం నుండి 52 కిలోమీటర్ల దూరంలో మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయం. ఉన్నది.
స్వామి వారి చరిత్ర..
రాష్ట్రంలో పవిత్ర పుణ్య క్షేత్రాలలో ఒకటైన నాగర్ కర్నూల్ జిల్లాలోని మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఒకటి. పచ్చదనానికి నిలయమైన నల్లమల కొండలపై ప్రవహించే కృష్ణా నది ఉత్తర వాహినిగా పశ్చిమ భాగాన దుందుభి నది సంభవించు రెండు నదుల కలయిక నడుమ 12 కి. మి దూరంలో ప్రకృతి రమణీయ దృశ్యముల నడుమ వెలసిన ప్రకృతి ఒడిలో సహజంగా ఒదిగిన మద్దిమడుగు పుణ్యక్షేత్రానికి కృష్ణానది ఒక ఆభరణం లాంటిదే. క్రీస్తు శకం 1120 కాలము నాడు అలనాటి ఆటవికులకు స్వయంభుగా స్వామివారి దర్శనం ఇచ్చి ఉండేనని చర్చించుకుంటారు.
భక్తుల కొంగుబంగారం..
మద్దిమడుగు క్షేత్ర పాదాలను స్పర్శిస్తూ కదిలే కృష్ణమ్మ భక్తుల పాపాలను కడుగుతుందని శోభియ భారంగా కరివిందు చేస్తూ ఉంటుందని వారి నమ్మకం. ఆంజనేయ స్వామి వారిని మనస్ఫూర్తిగా సేవిస్తే తీరని బాధలు అడ్డు ఉండవని, గాలి, ధూళి లాంటి మానసిక బాధలు,మొండి వ్యాధులను నయం చేసే దేవుడిగా, సంతానార్తులకు సంతానాన్ని ప్రసాదించే ఇలవేల్పుగా మానసిక ఆందోళనలు హరించే స్వామిగా కొంగుబంగారంగా ఇలా కొలిచే భక్తులకు దేవదేవుడు కొనియాడ పడుతున్నాడు. స్వామివారికి 41 రోజులు నిష్ఠతో దీక్ష పరీక్షల్లో చేస్తే ఎలాంటి కోరికలు అయినా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకు ప్రతి ఏడాది రెండు పర్యాయాలు భక్తులు శ్రీ హనుమాన్ దీక్షను వేలాదిగా సేకరిస్తూ ఉంటారు.
అత్యంత శక్తిగా కోట మైసమ్మ..
అత్యంత మహిమాన్విత శక్తి క్షేత్రంగా మద్దిమడుగు లో వెలసిన కోట మైసమ్మ అమ్మవారు అగ్రస్థానాన్ని వహిస్తుంది. ప్రతి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని దర్శించుకుంటారు. సహస్ర కోటి లాభాలతో పిలుపు రద్దుకుంటున్న జగన్నాథ పంచేంద్రియాలను నిగ్రహిస్తూ భూతాత్మకమైన శరీరాన్ని భరిస్తూ ప్రకృతి శక్తులను నియంత్రిస్తూ కలియుగంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి జగన్నాధ్ ఈ క్షేత్రం కోట మైసమ్మ అమ్మవారి గా అవతరించింది.
జయంతి ఉత్సవ కార్యక్రమాలు..
మద్దిమడుగు ఆంజనేయ స్వామి జయంతి కార్యక్రమాలు ఈనెల 10 నుంచి 12 తారీఖు వరకు రోజువారీ కార్యక్రమాలు ఇలా జరగనున్నాయి. 10న గురువారం త్రయోదశి అగ్ని ప్రతిష్టాపన-ధ్వజారోహణం రాత్రి 8 గంటలకు అశ్వవాహన సేవ, శివపార్వతుల కళ్యాణ మహోత్సవం, 11న గవ్యాంత పూజలు, వాస్తు పూజ, మన్య సూక్త హోమం, రుద్ర హోమం, గరుడ వాహన సేవ రాత్రికి లోక కళ్యాణం అర్థం సీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 12 న హనుమాన్ జయంతి ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారికి 108 కలశములతో మహా స్నపనం, హనుమాన్ గాయత్రి హోమం హనుమాన్ మాల దీక్ష విరమణ. పూర్ణాహుతి
ఏర్పాట్లు పూర్తి..
హనుమాన్ బ్రహ్మోత్సవాల సందర్భంగా మద్దిమడుగు ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, వైద్య సదుపాయాలు, ఇతర ఏర్పాట్లు అన్ని పూర్తి చేశామని ఆలయ చైర్మన్ దేశ వత్ రాములు, ఆలయ కార్యనిర్వహణ అధికారి నర్సింలు తెలిపారు. ఆలయ వద్ద నిత్య అన్నదానం చేసేందుకు భక్తుల నుంచి విరాళాలు కోరుతున్నామని, భక్తులు ఇచ్చే విరాళాలను బట్టి వారికి ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి దర్శనం కల్పించనున్నట్లు వారు వివరించారు.

