గ్రామ గ్రామాన జ్యోతిబాపూలే జయంతిని నిర్వహించాలి
సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ చైర్మన్ గోపి
జడ్చర్ల రూరల్, ఏప్రిల్ 7 (మనఊరు ప్రతినిధి): గ్రామ గ్రామాన ఈనెల 11న 198వ మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతిని నిర్వహించాలని సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ చైర్మన్ మీనగా గోపి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని మండల విద్యా వనరుల కేంద్రం ఆవరణలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక విప్లవకారుడు జ్యోతిబా పూలేను ఆదర్శంగా తీసుకొని బడుగు, బలహీన వర్గాల ప్రజలు జయంతి వేడుకలను నిర్వహించాలని వారు. బలహీన వర్గాలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడిన మహానీయుడు జ్యోతిబా పూలే అన్నారు. మహిళల విద్యకు జ్యోతిబాపూలే ఎనలేని సేవలు అందించారన్నారు. ఆయన చేసిన సేవలను యావత్భారతావని మరిచి పోలేదన్నారు. మహిళల్లో అక్షరాస్యతను పెంపొందించి హక్కుల కోసం పోరాడిన మహానీయుడని కొనియాడారు. బహుజనుల, వెనుకబడిన వర్గాల కోసం మహాత్మా జ్యోతిబా పూలే చేసిన సేవల్ని గుర్తుంచుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. బిసి ఐక్యత కోసం ఫూలే తన జీవితాన్ని ధారపోశారని అన్నారు.
స్విపర్లుకు రూ 50వేల వేతనం ఇవ్వాలి
ఓబీసీ దళిత ముస్లిం ఆల్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు ఫకీర్ జాంగిర్ పాషా మాట్లాడుతూ సమాజంలో స్విపర్లు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో
నాలుగవ తరగతి ఉద్యోగులుగా దీనమైన పరిస్థితుల్లోజీవనం గడుపుతున్నారని వారికి నెలకు రూ 50వేల వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ఓబీసీ పస్పంద ముస్లిమ్ జాతీయ అధ్యక్షులు ఫకీర్ జహంగీర్ పాషా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సావిత్రి బాయి పూలే ఫౌండేషన్ సీఈఓ పరమేశ్వరి, రజక సంఘము జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు నవితరాణి, గొల్లపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, గోపాల్, యాదయ్య, చెట్టెమ్మ, తదితరులు పాల్గొన్నారు.
