బయటనుండి ఏ ఇతర పదార్థాలు పాఠశాల తేకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది?*

 *విద్యార్థుల జీవితాలతో చెలగాటమా*

*ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది*

*విద్యార్థులు పండగకు వెళ్లి బక్షాలు తేవడం వల్లనే ఇలా జరిగింది అనడం ఎంతవరకు సమంజసం*

*బయటనుండి ఏ ఇతర పదార్థాలు పాఠశాల తేకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది?*

*బాద్యులైన వారిని వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కమ్మరిభూపాలాచారి డిమాండ్* 



కొందుర్గు, ఏప్రిల్ 2 (మనఊరు ప్రతినిధి): మండలంలోని కస్తూర్బా పాఠశాలలో ఎలుకలు విద్యార్థులను కరవడానికి కారకులైన వారిని వెంటనే విధుల నుండి తొలగించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మాజీ సర్పంచ్ కమ్మరిభూపాలాచారి డిమాండ్ చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా సమాదానం ఇవ్వడం పోగా విద్యార్థులు పండగకు వెళ్లి బక్షాలు తేవడం వల్లే ఇలా జరిగిందనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు

బయటినుండి తినుబండారాలు లోనికి తీసుకుని రాకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు. గతంలో కూడా ఇదే పాఠశాల షాద్ నగర్ లో కొనసాగినప్పుడు వర్షాల కారణంగా పాఠశాల తరగతి గదుల్లో నీరు వచ్చి విద్యార్థులు అవస్థలు పడితే అప్పుడు కూడా పాఠశాల బాద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వారిపైనే ప్రభుత్వం చట్టపరమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే ఉపేక్షించేది లేదని అన్నారు.