వరంగల్ కు కదిలిన ఎల్లికట్ట గులాబీ దండు

 *వరంగల్ కు కదిలిన ఎల్లికట్ట గులాబీ దండు* 









కల్వకుర్తి, ఏప్రిల్ 27 (మనఊరు ప్రతినిధి): బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ జరుపుకుంటున్న సందర్భంగా చలో వరంగల్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆదివారం  బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు యాకల బీమయ్య టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు యాకల బీమయ్య ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు,నాయకులు, అభిమానులు వరంగల్ పార్టీ రజతోత్సవల్లో భాగంగా వరంగల్ ఎల్కుర్తిలో నిర్వహిస్తున్న సభకు గ్రామం నుంచి కార్యకర్తలు తరలి వెళ్లారని ఆయన పేర్కొన్నారు. ఊహించని స్థాయిలో స్వచ్ఛందంగా పార్టీ అభిమానులు, కెసిఆర్ అభిమానులు సభకు తరలిరావడం సంతోషకరమని అభిప్రాయపడ్డారు. రజతోత్సవ సభ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని మరోమారు నిలిపే విధంగా నిలుస్తుందని చెప్పారు. చలో వరంగల్ సభకు బయలుదేరిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్లారు.