చలివేంద్రం, అంబలికేంద్రం ప్రారంభించిన మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్

 పెద్దకొత్తపల్లిలో చలివేంద్రం, అంబలికేంద్రం ప్రారంభించిన మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్





పెద్దకొత్తపల్లి, ఏప్రిల్ 29 (మనఊరు ప్రతినిధి): మండల కేంద్రంలోని పెద్దకారపాముల దారిలో మంగళవారం ఏర్పాటు చేసిన చలివేంద్రం, అంబలికేంద్రంను మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సహకారాలతో పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం వేసవికాలంలో మండల ప్రజల దాహం తీర్చుటకై తన వంతు సహాయంగా సొంత ఖర్చులతో చలివేంద్రాన్ని, అంబలి కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మండల కేంద్రంలో పెద్ద కార్పాముల, నాయినోనిపల్లి మైసమ్మ రోడ్డు మార్గమధ్యలో చలివెంద్రాన్ని, అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. అంతకుముందు రహదారి ప్రజలకు అంబలి పోసి అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దండు నరసింహ, మాజీ ఎంపీపీ వరదరాజుల వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచులు ఆదేర్ల వెంకటేశ్వర్ రెడ్డి, వి సత్యం, పగడాల చిన్నయ్య, మాజీ ఎంపిటిసి డి రవికుమార్, మాజీ మాజీ ఉపసర్పంచ్ లో మల్లయ్య, మేకల మల్లేష్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.